అదిలాబాద్

నామినేషన్లకు నేటితో తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, నవంబర్ 18: నామినేషన్ల ఘట్టానికి సోమవారంతో తెర పడనుండగా టికెట్లు దక్కని కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అసంతృప్త నేతలు తిరుగుబాటు అభ్యర్థిగా పోటీలో నిలిచేందుకు సిద్దమయ్యారు. ఇంతకాలం టికెట్ కోసం పోటీ పడి విఫలమైన నేతలంతా పార్టీ అధిష్ఠానంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎన్నికల బరిలో నిలిచి తాడోపేడో తేల్చుకుంటామని ఆల్టీమెటం జారీ చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బిజెపి, టీఆర్‌ఎస్, సిపిఐ అభ్యర్థుల జాబితా పూర్తికాగా మంచిర్యాలలో బిజెపి టికెట్‌ను ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఎన్నికల బరిలో తిరుగుబాట్లకు దారితీస్తోంది. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ నుండి గండ్రత్ సుజాతకు టికెట్ ఖరారు కావడంతో మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇంచార్జి భార్గవ్‌దేశ్ పాండేలు భవిషత్ కార్యాచరణపై కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కొందరు నేతలు తిరుగుబాటు అభ్యర్థిగా పోటీచేయాలని రాంచంద్రారెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. ఆదివారం పార్టీ ఇంచార్జి, పుదుచ్చెర్రి ముఖ్యమంత్రి నారాయణ స్వామి రాంచంద్రారెడ్డికి ఫోన్‌చేసి హైదరాబాద్ రావాల్సిందిగా కబురు పంపారు. హైదరాబాద్ వెళ్ళిన రాంచంద్రారెడ్డిని పార్టీ సీనియర్లు బుజ్జగించి రంగం నుంచి తప్పుకోవాలని, ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆశాచూపారు. దీంతో ఆయన కాస్తా వెనక్కితగ్గినట్లు తెలుస్తోంది. బోథ్‌లో టికెట్ రాని నియోజకవర్గ ఇంచార్జి అనిల్‌జాదవ్ కాంగ్రెస్ అధినేతల తీరుపై దిక్కార స్వరాన్ని వినిపించారు. పార్టీ అభ్యర్థి సోయం బాపురావును ఓడిస్తామని కార్యకర్తలు ఒత్తిడి తీసుకరావడంతో అనిల్ జాదవ్ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు ప్రకటించారు. ముథోల్ కాంగ్రెస్‌లో అసమ్మతి ఇంకా చల్లారలేదు. టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఎన్‌సిపి పార్టీ గుర్తుపై పోటీచేసేలా బిఫారం సాధించుకున్నారు. మరోవైపు ఖానాపూర్‌లోనూ కాంగ్రెస్ అసమ్మతి నేతలు బిఎస్పీ గుర్తుపై పోటీచేసేందుకు కార్యాచరణ సిద్దం చేశారు. టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న మాజీ మంత్రి జి.వినోద్ బెల్లంపల్లి, చెన్నూర్ టికెట్లు ఆశించి భంగపడడంతో బెల్లంపల్లి బరిలో బిఎస్పీ అభ్యర్థిగా పోటీచేయనున్నారు. సోమవారం చివరి రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు వినోద్ వర్గీయులు స్పష్టం చేశారు. మంచిర్యాలలో కాంగ్రెస్ టికెట్ దక్కని అరవింద్ రెడ్డి తెరాసలో చేరి దివాకర్‌రావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. చెన్నూరులో టికెట్ రాక తీవ్ర నిరాశతో అసంతృప్తి సెగలు గక్కుతున్న మాజీ మంత్రి బోడ జనార్ధన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటానని, కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా ముందుకెళ్తానని స్పష్టం చేయడం గమనార్హం. అదే విధంగా సిర్పూర్‌టిలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా రావి శ్రీనివాస్, టీఆర్‌ఎస్ తిరుగుబాటు అభ్యర్థిగా కావేటి సమయ్యలు నామినేషన్ దాఖలు చేయడంతో అక్కడి రాజకీయం రంగులు మారుతోంది. జిల్లాలో అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకొని సముదాయిస్తుండగా, టీఆర్‌ఎస్‌లో మంత్రి కెటిఆర్ రంగంలో దిగి అసమ్మత్తిని చల్లార్చేందుకు రాజీమార్గాలు సాగిస్తున్నారు. దీంతో జిల్లాలో రాజకీయం రోజుకో మలుపు తీరుగుతుంది.