అదిలాబాద్

ఎన్నికలప్పుడే సమస్యలు గుర్తుకువస్తాయా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్,నవంబర్ 19: ఎన్నికలప్పుడే సమస్యలను తెరపైకి తెచ్చి ప్రతిపక్షాలు కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆదిలాబాద్ టీ ఆర్ ఎస్ అభ్యర్థి జోగురామన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఆయా కాలనీల్లో ఏర్టా చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో టీఆర్‌ఎస్ అభ్యరిథ, అపద్దర్మ మంత్రి జోగురామన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా కస్తాల అన్నరావు అధ్వర్యంలో వంద మంది టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అనంతరం జోగురామన్న మాట్లాడుతూ బిజెపి, కాంగ్రెస్ నాయకులకు ఎన్నికల్లోనే ప్రజా సమస్యలు గుర్తుకు వస్తాయన్నారు. బిజెపి అభ్యర్థి పాయల శంకర్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, ఎంతో మంది వ్యాపారులను నట్టెట ముంచారని, ఆయనను ఎమ్మెల్యేగా గెలిస్తే ఆదిలాబాద్‌ను అమ్మడం ఖాయమని అన్నారు. అనంతరం ఖానాపూర్ కాలనీలో జరిగిన చేరికల కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. కాలనీకి వచ్చిన మంత్రి రామన్నను బ్యాండ్ మేళాలతో స్వాగతం పలికారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయూబ్, యూసుఫ్ అధ్వర్యంలో వందలాది మంది యువకులు, మహిళలు మంత్రి జోగురామన్న సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం తాటిగూడలో చైతన్యజైన్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి హాజరుకాగా వివిధ వర్గాలకు చెందిన మమిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు లోక భూమారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, ఐసిడిఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి బోజారెడ్డి, అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు సిరాజ్ ఖాద్రి, యూనుస్ అక్బాని, సాజిదొద్దిన్,, కాళ్ళ విఠ్ఠల్ తదితరులు పాల్గొన్నారు.