అదిలాబాద్

క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, నవంబర్ 20 : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరి అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో డిసెంబర్ 3 న దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన దివ్యాంగుల జిల్లా దినోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు అంటే విభిన్న ప్రతిభ కలిగిన వారన్ని వైకల్యం ఉందని నిరూత్సహా పడకుండా రెట్టింపు ఉత్సహాంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. అవయవ దానం చేయడం ఒక్క ఉద్యమం లా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, కళ్లను దానం చెస్తే తిరిగి జీవించే అవకాశం ఉందని, శరీర అవయవాలు దానం చేసి ప్రమాదానికి గురైన వ్యక్తులకు ప్రాణదాతలు కావాలని అన్నారు. క్రీడలలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని ఐక్యమత్యతో కలిసి కట్టుగా ముందుకు సాగితే ఎదైనా సాధించ వచ్చని క్రీడలు మనకు తెలుపుతున్నాయన్నారు. ఈ జిల్లా స్థాయి క్రీడలలో గెలుపోందిన దివ్యాంగులు ఈ నెలాఖరున నిర్వహించే రాష్ట్ర స్థాయి క్రీడలలోపాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్, డి ఆర్ డి ఓశంకర్, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అసదుద్దీన్‌వి తప్పుడు ఆరోపణలు
* నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా
* ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్, నవంబర్ 20: ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పూర్తిగా అసత్యాలు మాట్లాడి తనపై బురదజల్లే కార్యక్రమానికి పూనుకున్నారని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షులు, నిర్మల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యిర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం నిర్మల్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అసదుద్దిన్ ఓవైసీ నిర్మల్‌లో పర్యటించవద్దని.. ఇందుకు తాను డబ్బులు ఇస్తానని చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు. దీనిని నిరూపిస్తే పోటీ నుండి తప్పుకోవడమే కాకుండా రాజకీయాల నుండి వైదొలుగుతానని సవాల్ విసిరారు. సోమవారం నిర్మల్‌లో నిర్వహించిన తన నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా కాంగ్రెస్ శ్రేణులు, పార్టీ అభిమానులు తరలిరావడంతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి మతి భ్రమించి ఎటూపాలుపోక అసదుద్దిన్ ఓవైసీని నిర్మల్‌కు పిలిపించి ఆరోపణలు చేయించాడని విమర్శించారు. ఓవైసీ గతంలో బీ ఎస్పీకి మద్దతు తెలిపారని, ఇప్పుడు టీ ఆర్ ఎస్‌కు మద్దతు తెలుపుతున్నారని, భైంసాలో కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నారని, ఇలా ప్రాంతాల వారీగా పలు పార్టీలకు మద్దతునిస్తూ నిలకడ లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.