అదిలాబాద్

నాలుగేళ్ళ అభివృద్ధిని చూసి ఓటేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్,నవంబర్ 20: 60 ఏళ్ళలో జరగని అభివృద్దిని నాలుగేళ్ళలో చేసి చూపించిన ఘనత టీఆర్‌ఎస్‌పార్టీకే దక్కుతుందని ఆదిలాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి, అపద్దర్మ మంత్రి జోగురామన్న అన్నారు. బేల మండలంలోని దహెగాంతో పాటు మారుమూల గిరిజన గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్భంగా మంత్రి రామన్న సమక్షంలో పలువురు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అనంతరం మంత్రి రామన్న మాట్లాడుతూ మారుమూల గ్రామాలను అభివృద్దిచేసిన ఘనత టీ ఆర్ ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రతి పల్లెకు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపేందుకే మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి పూర్తిచేయడం జరుగుతుందని, పెన్‌గంగా ప్రాజెక్టు పూర్తయితే ఇక్కడి వేల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. దీంతో రైతుల జీవితాలు మెరుగుపడడం ఖాయమన్నారు. వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసి ఆర్ రైతు బీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందనీ, ఈ పథకాలు అమల్లోకి వచ్చిన అప్పటి నుండి రైతుల కష్టాలు, ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఈసారి కూడా టీఆర్‌ఎస్ పార్టీని ఆదరించి గెలిపిస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆదిలాబాద్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్భంగా మంత్రి రామన్న టీకొట్టులో టీ విక్రయిస్తూ వినూత్న ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రౌత్ మనోహర్, ఎంపిపి రఘుకుల్ రెడ్డి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

వృత్తి నైపుణ్యంతోనే సహకార సంఘాల అభివృద్ధి: కలెక్టర్
మంచిర్యాల, నవంబర్ 20: సహాకార సంఘాల అభివృద్దికి వృత్తి నైపుణ్యం తోనే సాధించ వచ్చని జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరి అన్నారు. మంగళవారం 65వ అఖిల భారత సహాకార వారోత్సవాల సందర్బంగా స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర సహాకార యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ బి అరుణ్‌తో కలిసి సహాకార సంఘాల ద్వారా సాంకేతిక నైపుణ్యత అభివృద్ది అనే అంశంపై మాట్లాడారు. దేశంలో కొన్ని సంస్థలు వృత్తి నైపుణ్యంతో అభివృద్ది చెందుతాయని జిల్లాలో వృత్తి నైపుణ్యతలో శిక్షణ ఇస్తే సహాకార సంఘాలు బలంగా ఎదుగాతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల యువతీ, యువకులకు, మహిళలకు వృత్తి నైపుణ్యం అవసరమని సహాకార సంఘాలు లాభాలు మాత్రమే కాకుండా విలువలు, ఉద్యోగ కల్పన, ఉపాధి దిశగా అభివృద్ది చెందాలన్నారు. అనంతరం సహాకార సంఘాలు బలోపేతం చేసిన వారికి మెమోటోతోపాటు ధృవీకరణ పత్రాలు కూడా అందజేశారు.