అదిలాబాద్

పార్టీలు పదిలం.. స్వతంత్రులకే తిరస్కారం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,నవంబర్ 20: నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మంగళవారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. పది నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థుల పత్రాలు సక్రమంగానే ఉండడంతో రిటర్నింగ్ అధికారులు వాటిని ఆమోదించగా పలుచోట్ల స్వతంత్ర అభ్యర్థులు అఫిడవిట్లు, ఏ, బి ఫారాలు దాఖలు చేయకపోవడంతో వాటిని తిరస్కరించారు. ప్రధాన పార్టీల నుండి దరఖాస్తు చేసుకున్న డమ్మి అభ్యర్థుల నామినేషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి. జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 177 మంది నామినేషన్లు దాఖలు చేయగా వీటిలో 38 నామినేషన్ పత్రాలు సక్రమంగా లేకపోవడంతో తిరస్కరించారు. ముథోల్‌లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి విజయ్‌కుమార్ రెడ్డి ఆమ్ ఆద్మి పార్టీ తరపున నామినేషన్ వేయగా నామినేషన్ పత్రాల్లో ప్రతిపాదించే వారి సంఖ్య సరిగ్గా లేకపోవడంతో పార్టీ గుర్తుపై కాకుండా స్వతంత్రంగా పోటీచేసేందుకు అనుమతించారు. జిల్లాలో నామినేషన్ల పరిశీలన అనంతరం ఈనెల 22 వరకు ఉపసంహరణ గడవు ఉండడంతో తిరుగుబాటు అభ్యర్థులను బరిలో నుండి తప్పించేందుకు బుజ్జగించే పనిలో పడ్డారు. నామినేషన్ల పరిశీలనలో తిరస్కారానికి గురైన వారి వివరాలు నియోజకవర్గాల వారీగా ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 21 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా వీరిలో 5 మంది అభ్యర్థుల పత్రాలు సరిగ్గా లేకపోవడంతో తిరస్కరించారు. ప్రస్తుతం 16 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బిజెపి అభ్యర్థి పాయల శంకర్ కూతురు శరణ్య డమ్మి అభ్యర్థిగా నామినేషన్ వేయగా బిఫారంలో ఆమె పేరు ప్రతిపాదించకపోవడం వల్ల తిరస్కరించారు. అదే విధంగా మరో నలుగురి స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. బోథ్ బరిలో 9 నామినేషన్ దాఖలు కాగా వీరిలో ముగ్గురు నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. ముథోల్ నియోజకవర్గంలో 18 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా నలుగురి నామినేషన్లు తిరస్కరించారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి టి.విజయ్‌కుమార్ రెడ్డి ఆమ్ ఆద్మి పార్టీపై కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉండనున్నారు. చెన్నూరులో 23 మంది నామినేషన్ దాఖలు చేయగా వీటిలో 8 నామినేషన్లు సక్రమంగా లేకపోవడంతో తిరస్కరణకు గురయ్యాయి. బెల్లంపల్లిలో 22 మంది నామినేషన్ దాఖలు చేయగా వీరిలో 5 మంది నామినేషన్ పత్రాలు తిరస్కరించారు. వీరిలో బిఎస్పీ తరపున నామినేషన్ వేసిన కె.శ్రీనివాస్ బిఫారాలు సమర్పించకపోవడంతో తిరస్కరణకు గురయ్యారు. దీంతో 16 మంది అభ్యర్థులు బరిలో నిలువనున్నారు. సిర్పూర్‌టి నియోజకవర్గంలో 13 మంది నామినేషన్ దాఖలు చేయగా ఆరుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తెరాస బిఫారం లేకుండానే నామినేషన్ వేసిన తిరుగుబాటు అభ్యర్థి కావేటి సమ్మయ్యను స్వతంత్ర అభ్యర్థిగా గుర్తించారు. మంచిర్యాలలో 26 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా వీరిలో ఒకరి నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆసిఫాబాద్‌లో 11 మంది నామినేషన్ దాఖలు చేయగా వీరిలో ముగ్గురి నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. బిఎస్పీ రెబల్ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న సుభాష్‌తో పాటు మరో ఇద్దరిని తిరస్కరించారు. ఖానాపూర్‌లో 15 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. రమేష్ రాథోడ్ తనయుడు రితేష్ రాథోడ్ డమ్మి అభ్యర్థిగా నామినేషన్ వేసి బిఫారం సమర్పించకపోవడంతో తిరస్కరించారు. బిఎస్పీ నుండి నామినేషన్ వేసిన సుఖెందర్ అభ్యర్థితత్వం కూడా తిరస్కరణకు గురైంది. నిర్మల్ నియోజకవర్గంలో 11 నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా ముగురు తిరస్కరణకు గురయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి సతీమణి ఏలేటి కవిత డమ్మి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి బిఫారం సమర్పించకపోవడంతో తిరస్కరించారు. ఎన్నికల నామినేషన్ల గట్టం చివరి అంకంలో భాగంగా ఉపసంహారణకు మరో రెండు రోజుల గడవు ఉండడంతో ఇంకా ఎంత మంది బరిలో నుండి తప్పుకుంటారో వేచిచూడాల్సిందే.

రాజీనామా బాటలో కాంగ్రెస్ నాయకులు..!
* కూటమిలో కనిపించని వైనం
బెల్లంపల్లి, నవంబర్ 20: బెల్లంపల్లి పట్టణంలో రాజకీయంగా అనూహ్యా మార్పులు చోటు చేసుకున్నాయి. మహా కూటమి పార్టీలో భాగంగా అసెంబ్లీ నియోజక వర్గంలో మహా కూటమి పొత్తులో సిపి ఐ కి కేటాయించారు. నిన్నటి వరకు కాంగ్రెస్ నుండి టికేట్లు ఆశించిన నాయకులు నిత్యం కార్యాలయాన్ని అంటు పెట్టుకొని ఉండి నాయకులు గత వారం రోజులుగా కనిపించకుండా పోయ్యారని పలువురు పేర్కొంటున్నారు. సీపీఐ అభ్యర్థిగా గుండా మల్లేష్ నామినేషన్ వేసే సమయంలోను, గుండా మల్లేష్ కుటుంబ సభ్యులతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన వెంట సైతం మహా కూటమిలో కూటమికి చెందిన ప్రధాన నాయకులు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. బెల్లంపల్లి స్థానానికి సిపి ఐ కి కేటాయిస్తే రాజీనామా చేస్తామని చెప్పిన కొందరు నాయకులు రాజీనామా చేసేందుకు సన్నద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలు మాత్రమే ఉంటుండగా ప్రధాన నాయకులు కంటికి కానరాకుండా పోయ్యారు. అసలు ఈ నాయకులు ఉన్నారా లేరా, ఊటికి వెళ్లారా అనే ప్రశ్నప్రతి ఒక్కరిలో తలెత్తుతుంది. కూటమి ప్రచారంలో కనిపిస్తారా లేదా అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో తలెత్తుతున్నాయి. మహా కూటమి పొత్తులో సిపి ఐ అభ్యర్థి గెలుపుకు కాంగ్రెస్ నాయకులు వస్తారో లేదో తేలాల్సి ఉంది.