అదిలాబాద్

కుమ్రంభీం జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, డిసెంబర్ 7: సమస్యాత్మక ప్రాంతమైన కుమరం భీం జిల్లాలో ఎన్నికల ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుండే ఓటర్లు పోలింగ్ బూతుల వద్ద బారులు తీరారు. మావోయిస్టు ప్రాంతం కావడంతో జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో 4గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. నిర్ణీత గడువులోగా జిల్లా వ్యాప్తంగా 78.52శాతం పోలింగ్ నమోదు కాగా, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 78.88శాతం, సిర్పూర్ నియోజకవర్గంలో 78.09శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ మొదలైన కొద్దిసేపటికే పలు చోట్ల ఇవిఎంలు మొరాయిండంతో, పోలింగ్ ప్రక్రియకు ఆటంకం తలెత్తింది. చాలాచోట్ల ఓట్లు గల్లంతు కావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ఎస్పీ మల్లారెడ్డి అధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలతో బందోబస్తు నిర్వహించారు. ఎన్నికలు జరుగుతున్న తీరును పరిశీలకురాలు కృష్ణ గోహెన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పోలింగ్ బూత్‌ల్లోకి వెల్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఓటు వేసిన కలెక్టర్, ఎస్పీ
ఆసిఫాబాద్ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనకాపూర్ పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ రాజీవ్‌గాందీ హన్మంతు, ఎస్పీ మల్లారెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కలెక్టర్ ఓటు వేసేందుకు ఏకంగా క్యూలైన్లో నిలుచున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కుటుంబ సబ్యులతో కలిసి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకోగా, తిర్యాణి మండలం లక్ష్మీపూర్‌లో ఆత్రం సక్కు, కాగజ్‌నగర్ కేంద్రంలో తాజామాజీ ఎమ్మెల్యే కోనప్ప, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి హరీష్, బిజెపి అభ్యర్థి డాక్టర్ శ్రీనివాస్, బిఎస్‌పి అభ్యర్థి రావి శ్రీనివాస్‌లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఎన్నికలకు భారీ బందోబస్తు
మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంగా పేరున్న కుమరం భీం జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎస్పీ మల్లారెడ్డి నేతృత్వంలో డీఎస్పీలు సత్యనారాయణ, సాంబయ్యలు ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షించారు. సమస్యాత్మక కేంద్రాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సిఆర్‌పిఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. పోలింగ్ బూత్‌ల వద్దకు రాకుండా 200 మీటర్ల దూరంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే ఆయా పార్టీల మద్దతు దారులు ఓటు వేసేందుకు వెలుతున్న ఓటర్లను ఆకర్శించేందుకు యత్నించారు. అంతేకాకుండా మండలాల వారీగా ఓటింగ్ సరలిని తెలుసుకునేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజక వర్గంలో పర్యటించడం కనిపించింది. ఎప్పటికప్పుడు తమ అనుచరుల ద్వారా ఓటింగ్ సరలిని తెలుసుకొని ఆధిక్యంపై బేరీజు వేసుకోవడం కనిపించింది.