అదిలాబాద్

నిర్మల్‌లో ఓటు వేసిన ప్రముఖులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, డిసెంబర్ 7: శాసనసభ సాధారణ ఎన్నికలు శుక్రవారం నిర్మల్‌లో ప్రశాంతంగా జరుగగా పలువురు ప్రముఖులు తమఓటును వినియోగించుకున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతోపాటు జిల్లా కేంద్రంలో నివాసముండే ఉన్నతాధికారులు తమకు కేటాయించిన పోలింగ్ సెంటర్‌కు వెళ్లి క్యూలో నిలబడి మరీ ఓటు వేశారు. నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తన స్వగ్రామమైన ఎల్లపెల్లిలో ఉదయం పూటే కుటుంబ సభ్యులతో కలిసి ఓటువేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి గాజుల్‌పేట్‌లోని పంచశీల్ కాలేజ్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటును వినియోగించుకున్నారు. అలాగే బీజేపీ అభ్యర్థి డాక్టర్ స్వర్ణారెడ్డి రవి ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటువేశారు. కలెక్టర్ ప్రశాంతి ఎడీవో కార్యాలయంలో ఓటువేయగా, జేసీ రవి ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సెంటర్‌లో ఓటును వినియోగించుకున్నారు. ఎస్పీ శశిధర్‌రాజు ఆయన సతీమణి రమాదేవితో కలిసి ఎంపీడీవో కార్యాలయంలో సెంటర్‌లో ఓటువేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్ని పనులు ఉన్నప్పటికి ప్రతీ ఒక్కరు ఓటువేయాలన్నారు. జిల్లాలో భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలు స్వేచ్చగా, స్వతంత్రంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు.