అదిలాబాద్

మొరాయించిన ఈవీఎంలు.. ఆలస్యంగా పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, డిసెంబర్ 7: శాసన సభ ఎన్నికలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ముగిసాయి. శుక్రవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలీంగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగింది. 4 తరువాత బూత్‌లకు వచ్చిన ఓటర్ల కోసం అధికారులు అవకాశాలు కల్పించారు. పలు ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాలలో రాత్రి వరకు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీంగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. సమస్యత్మక ప్రాంతాలు అయిన హామాలివాడ, ఏసిసి, పాత మంచిర్యాల తదితర ప్రాంతాలలో ప్రత్యేక బందోబస్తును పోలీస్ అధికారులు ఏర్పాటు చేశారు. పోలీంగ్ కేంద్రాలను డిసిపి వేణుగోపాల్ రావుతో పాటు ఏసిపి గౌస్‌బాబాల ఆధ్వర్యంలో పోలీంగ్ సరళీని అడిగి తెలుసుకొని పోలీంగ్ కేంద్రాలను పరిశీలించారు. పలు ప్రాంతాలలో రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాల వద్ద పోటా పోటీగా ప్రచారం చేపట్టడంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతాలకు వెళ్లి ప్రచారం చేస్తున్న వారిని తరిమికొట్టారు. పోలింగ్ కేంద్రాలలో ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. నస్పూర్, హాజీపూర్, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల్లో ఉదయం నుండే ఓటర్లు ఉత్సహాంగా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం కేంద్రాల వద్దకు చేరడంతో పండుగ వాతావరణం నెలకొంది. మధ్యాహ్నాం నుండి పోలింగ్ మందకొడిగా సాగినప్పటికీ సాయం త్రం 4గంటల వరకు పోలీంగ్ శాతం సాగింది. ఓటర్లను తరలించేందుకు ఆయా పార్టీల నాయకులు ప్రత్యేక వాహనాలను సమకూర్చి పోలీంగ్ కేంద్రాలకు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి వికలాంగులకు, వృద్దులకు ప్రత్యేక వీల్ చైర్‌లతో పాటు వాహనాలను కూడా ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల నుండి తరలించారు. పోలీంగ్ కేంద్రాలలో సరైన వెలుతురు లేక పోవడంతో ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు. సాంకేతిక ఈవీఎంలు కొన్ని పోలింగ్ కేంద్రాలలో మొరాయించాయి. విద్యుత్ లైటింగ్ లేక ఓటర్లు చాలా ఇబ్బందులు పడటంతో అధికారులకు, రాజకీయ నాయకులకు విద్యుత్ లైట్‌లు ఏర్పాటు చేయాలని తెలపడంతో పోలీంగ్ కేంద్రాలలో బల్బులను ఏర్పాటు చేశారు. ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో కొత్త ఓటర్లు ఉత్సహాం చూపారు. యువతీ, యువకులు నూతనోత్సహాంతో కేంద్రాలకు వచ్చి క్యూ లో ఉండి ఓటు వేశారు. ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో తాము భాగస్వామ్యులేమని ఓటర్లు తెలిపారు.
పోలింగ్ వివరాలు...
మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజక వర్గాలలో మొత్తం 64.38 శాతం ఓట్లు పోలు అయ్యాయి. చెన్నూర్ నియోజకవర్గంలో 67 శాతం, బెల్లంపల్లి నియోజకవర్గంలో 81శాతం, మంచిర్యాలలో 54 శాతం ఓట్లు పోలు కాగా సాయంత్రం వరకు కొనసాగుతున్న ఓటింగ్ శాతంను అధికారులు అంఛనా వేస్తున్నారు.
ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థులు
మంచిర్యాల నియోజకవర్గంలోని అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వ సలహదారుడు గడ్డం వివేకానంద తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి దివాకర్ రావు ఆర్‌బీహెచ్ హైస్కూల్‌లో కుటుంబ సమేతం గా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు పట్టణంలోని పోలీంగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటు వేశారు. బీజేపీ అభ్యర్థి వెర్రబెల్లి రఘునాథ్ తమ ఓటును కుటుంబ సమేతంగా వినియోగించుకున్నారు. ఆయా అభ్యర్థులు ఆయా పోలీంగ్ కేంద్రాలలో ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.