అదిలాబాద్

రైతులకు అండగా ఉంటాం.. అన్ని విధాల ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ మున్సిపాలిటీ,డిసెంబర్ 18: రైతులకు అండగా ఉంటూ అన్ని విధాలుగా ఆదుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల అందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సంబంధించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. గత రెండు రోజులుగా పౌర సరఫరాల శాఖ జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వర్షప్రభావం రైతాంగం మీదా ఏమాత్రం పడకుండా తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. ధాన్యం సేకరించేందుకు రెండు కొనుగోలు కేంద్రాలు ఉండే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. శాంతినగర్, దంతన్‌పల్లి గ్రామంలో ధాన్యాన్ని ప్రభుత్వం నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు ఏమాత్రం ఆధైర్యపడవద్దన్నారు. జిల్లాలో ఇంకా వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో నష్టం ఎక్కువగా ఉండకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని అన్నారు. ధాన్యం తడవకుండా ప్రతి కొనుగోలు కేంద్రంలో అవసరమైన గన్ని సంచులు, తాడిపత్రిలను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైసు మిల్లులకు తరలించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో వెయ్యి టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించడం జరిగిందన్నారు. ధాన్యం తరలింపులో క్షేత్రస్థాయి సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ, రవాణా, రూరల్ డెవలప్‌మెంట్ విభాగాలతో మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
పైథాన్‌తో
స్తంభించిన జనజీవనం
ఇచ్చోడ,డిసెంబర్ 18: బంగాళఖాతంలో ఏర్పడిన పైథాన్ తుపాన్ ప్రభావం గత రెండు రోజులుగా మండలంలో జన జీవనాన్ని స్తంభింపజేసింది. ఒక్కసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ప్రజలు ఇండ్ల నుండి బయటకు రాలేకపోతున్నారు. అత్యవసర పనులకు తప్పా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇండ్లకే పరిమితం అవుతున్నారు. ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురియడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 11 గంటల తర్వాతనే ప్రజలు బయటకు వెళ్ళి తమ పనులను పూర్తిచేసుకొని సాయంత్రం 6 గంటలకు ఇండ్లలోకి చేరుకుంటున్నారు.
సప్త వర్ణశోభితం
ఆకాశ దరహాసం..
లక్సెట్టిపేట, డిసెంబర్ 18: ఆకాశంలో మంగళవారం ఉదయం సప్త వర్ణ శోభితంలా శతకోటి ప్రజలకు ఆకాశం కన్ను విందు చేసింది. గత రెండు రోజులుగా పెథాయ్ తుఫాన్ సంభవిస్తున్న సందర్బం లో ఆకాశం పూర్తిగా మబ్బులాగా కమ్ముకు పోయింది.