అదిలాబాద్

మిషన్ భగీరథ పనుల్లో జాప్యం జరిగితే చర్యలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, ఫిబ్రవరి 15: ప్రజలకు రక్షిత మంచినీరు అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పనుల్లో ఏమాత్రం జాప్యం చోటు చేసుకున్నా చర్యలు తప్పవని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిణి, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ హెచ్చరించారు. జిల్లా కేంద్రం సమీపంలోని మాణిక్‌గుడ వద్ద నిర్మాణంలో ఉన్న మిషన్ భగీరథ ప్రధాన పనులను స్మితా సభర్వాల్ శుక్రవారం సందర్శించారు. ఇప్పటి వరకు పూరె్తైన, నిర్మాణంలో ఉన్న పనులను ఆమె పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాణిక్ గూడ భగీరథ కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 1101 ఆవాసాలకు రక్షిత నీరివ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 997 ఆవాసాలకు నీరు సరఫరా చేస్తున్నట్లు అధికారులు ఆమె దృష్టికి తెచ్చారు. మిగతా 68 ఆవాసాలకు వీలైనంత త్వరగా నీరిచ్చే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇంట్రా విలేజ్ గ్రిడ్ ద్వారా లక్ష 7వేల 595 నల్లా కనెక్షన్‌లు ఇంటింటికి ఇవ్వగా, 903 హెటేషన్లలో 169 ఇంకా ఇవ్వాల్సి ఉందని స్మిత పేర్కొన్నారు. ఆసిఫాబాద్ మండలంలో 56,635మంది జనాభాకు నీరు ఇవ్వడం కోసం 131.19కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం జరిగిందన్నారు. సమావేశంలో జేసీ రాంబాబు, ఇఎన్‌సీ కృపాకర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ ఎం. జగన్మోహన్ రెడ్డి, ఎస్‌ఇ జ్ఞానకుమార్, ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ వెంకట రమణ, ఇంట్రావిలేజ్ గ్రిడ్ ఇఇ కృష్ణమూర్తి, ఆర్డీవో సిడాం దత్తు, డీఎస్పీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆధునిక పంట సాగుపై రైతులు దృష్టిసారించాలి
* ఎస్పీ విష్ణు ఎస్ వారియర్

ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 15: శాస్తవ్రేత్తలు, వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనల మేరకు రైతులు ఆధునిక పంట సాగుపై దృష్టిసారించి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. రేడియో కిసాన్ దివస్ కార్యక్రమం శుక్రవారం ఆల్ ఇండియా రేడియో కేంద్రంలో నిర్వహించగా ఈ సమావేశానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రైతులు అప్పుల నుండి బయటపడేందుకు లాభసాటి పంటలు వేసుకోవాలని, మార్కెట్ డిమాండ్ మేరకు పంటలు పండించినట్లయితే గిట్టుబాటు ధరలు పొందే అవకాశం ఉంటుందన్నారు. దుకాణదారుల మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని, సారవంతమైన భూములను కాపాడుకోవాలన్నారు. పంటలను కాపాడుకునే సమయంలో కంచె తీగలకు విద్యుత్ అమర్చడం వలన రైతులు మరణాల బారిన పడుతున్నారని, దీంతో రైతు కుటుంబాలు ఆనాధలు కావడం జరుగుతుందన్నారు. పంట చుట్టూ బయో పెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడడం వలన భూముల సారవంతం దెబ్బతినడంతో పాటు రైతులు ఆనారోగ్యం బారిన పడుతున్నారని, సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టిసారించాలన్నారు. సబ్ కలెక్టర్ డాక్టర్ గోపి మాట్లాడుతూ రైతులు ఒకే సమయంలో ఒకే రకమైన పంటలు పండించడం వలన నష్టపోతున్నారని అన్నారు. జిల్లాలో తన శిక్షణ కాలంలో పరిశీలించిన అంశాలను ఆయన గుర్తుచేశారు. జొన్న, మొక్కజొన్న వంటి సాంప్రదాయ పంటలను పండించాలన్నారు. పత్తి రైతులు సీసీ ఐ వారికి అమ్మకుండా ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారని అన్నారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్యవక్త డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి మాట్లాడుతూ జీవ వైవిద్యాన్ని పెంపొందించాలని, అంతరించి పోతున్న అటవీ సంపదను కాపాడుకోవాలన్నారు. పూర్వకాలంలో రైతులు వ్యవసాయం, పశుపోషణ, ఉద్యాన పంటలు సాగుచేసేవారని అన్నారు. దిగుబడులు పెరుగుతున్న కొద్దీ ధరలు కూడా పెరుగుతున్నాయని, వ్యవసాయ రంగంలో పురాతన పద్దతులను పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అంతకు ముందు వివిధ శాఖల అధికారులు, శాస్తవ్రేత్తలు వారి అనుభావాలను, సూచనలు అందించారు. అనంతరం వివిధ పంటలు, పరిశ్రమలలో ప్రగతి సాధించిన ఉమ్మడి జిల్లాల రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ ఆకాశవాణి డైరెక్టర్ వి.రాజేశ్వర్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యవసాయ అధికారులు ఆశాకుమారి, అమరేష్ కుమార్, ఆసిఫాబాద్ జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శంకర్ రాథోడ్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి కె.వెంకటేశ్వర్లు, కెవికె సమన్వయక్త వై.ప్రవీణ్ కుమార్, సీనియర్ శాస్తవ్రేత్త శ్రీదర్ చౌహన్, ఏరువాక సమన్వయకర్త డా.సుధాంశుకస్బే, ఉద్యాన పరిశోధన స్థానం ఆర్.ప్రీతం, ముఖ్య కార్యనిర్వహణాధికారి సుమనస్పతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మీ త్యాగం వృదాపోనివ్వం
* అమరజవానులకు వెల్లువెత్తిన జోహర్లు

ఆదిలాబాద్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 15: కశ్మీర్ ఉగ్రదాడిలో అమరులైన వీరజవానుల ఆత్మకు శాంతిచేకూరాలని కోరుతూ జిల్లావ్యాప్తంగా నివాళులు వెల్లువెత్తాయి. జమ్ము కశ్మీర్‌లోని పూల్వామలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ శుక్రవారం బీజేపీ, ఏబీవీపీ, హిందూవాహిని, మెడికోలు, వివిధ సంఘాల నాయకులు నివాళులర్పించారు. వీరజవానుల త్యాగాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, వారి ఆత్మకు శాంతిచేకూరాలని కోరుతూ కొవ్వత్తులు వెలిగించి శ్రద్దాంజలి ఘటించారు. ఉగ్రవాద సంస్థల పిరికిపంద చర్యలకు దేశం దీటైన జవాబు ఇవ్వాలన్నారు. అమరుల కుటుంబాలకు దేశ ప్రజలందరూ అండగా నిలుస్తారని, ఉగ్ర సంస్థలకు నిలయమైన పాకిస్తాన్‌కు హెచ్చరిక పంపాలని డిమాండ్ చేశారు. ఏబివిపి అధ్వర్యంలో పట్టణంలోని వినాయక చౌక్‌లో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. ఈ సంధర్భంగా జిల్లా కన్వీనర్ ప్రశాంత్ మాట్లాడుతూ భారత జవానులు భారతీయులను కంటికిరెప్పల కాపాడుకుంటూ ఎళ్ళవేళలా దేశరక్షణ చేస్తుంటే ఉగ్రవాదులు దొంగదెబ్బ కొట్టడాన్ని పిరికిపంద చర్యగా భావిస్తున్నామన్నారు. వారి ఆత్మకు శాంతిచేకూరాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణమే పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్ దాడికి సిద్ధం కావాలన్నారు. అదేవిధంగా బీజేపీ అధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఆవరణలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సంధర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ మాట్లాడుతూ ఉగ్రవాద దాడిలో అమరజవానులు మృతిచెందడం బాధకరంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయని, పాకిస్తాన్ దేశం పద్దతి మార్చుకుంటుందని నరేంద్రమోది ఓపికతో ఉంటే ఇలాంటి ఉగ్ర సంస్థలకు స్థావరం కల్పిస్తూ దుశ్చర్యలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే పాకిస్తాన్ నామరూపాలు లేకుండాపోవడం ఖాయమన్నారు. హిందూవాహిని అధ్వర్యంలో స్థానిక తెలంగాణతల్లి చౌక్ వద్ద వీరజవానుల ఆత్మకు శాంతిచేకూరాలని కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూవాహిని పట్టణ కార్యదర్శి సుదీర్ మాట్లాడుతూ సెలవు దినాల్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపి విధుల్లో చేరబోతున్న జవానులపై ఉగ్రదాడి జరగడం దేశ ప్రజలను తీవ్రంగా కలిచివేసిందన్నారు. జైషే ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. రిమ్స్ మెడికోలు, డాక్టర్లు, నర్సింగ్ విద్యార్థులు, సిబ్బంది సైతం శాంతిర్యాలీ నిర్వహించి వీరజవానులకు జోహార్లు అర్పించారు. ముష్కర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, యావత్‌దేశం వీరజవానుల సేవలను స్మరించుకుంటుందన్నారు.

ఆనవాళ్లు కోల్పోతున్న పురాతన ఆలయాలు
* శిథిలావస్థకు చేరి చుట్టున్న గుడులు
* మట్టితో కప్పుకుపోతున్న రాతి విగ్రహాలు
* భక్తులు పెరుగుతున్నా సౌకర్యాలు కరువు
* చుచుంద్‌లోని సిద్దేశ్వర ఆలయం దుస్థితి
భైంసా రూరల్, ఫిబ్రవరి 15: కాకతీయుల కాలంనాటి గుడులన్నీ నేడు శిథిలదశకు చేరుకుంటున్నాయి. భైంసా ప్రాంతంలోని కట్టమహాదేవుని మందిరం, లోకేశ్వరం మండలంలోని బ్రహ్మేశ్వర ఆలయం ఇలా చెబుతూపోతే చుట్టుపక్కల గుడులన్నీ ఆ నాటికాలంలో నిర్మించినవే.. నాటి కాలంలో నిర్మించిన రాత్రి గుడులన్నీ నేడు శిథిలదశకు చేరుకుంటున్నాయి. ఆలయ కమిటీలు, గ్రామాభివృద్ది కమిటీలు, భక్తులు, దాతలు ముందుకువచ్చి తాత్కాలికంగా మరమ్మత్తులు చేపట్టి రాతి గుడుల స్థానంలో స్లాబులు నిర్మించి పూజలు చేస్తున్నారు. కాని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గుడులను కాపాడే ప్రయత్నం చేయడం లేదు. పురావస్తుశాఖ, దేవాదాయశాఖ అధికారులు కూడా ముందుకు రావడం లేదు. ఫలితంగా మనముందే ఈ గుడులు శిథిలదశకు చేరి ముందు తరాలకు చరిత్ర తెలియజేప్పే స్థలాలు కూడా కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఏర్పడింది.
ప్రాజెక్టు ముంపుతో....
2001 ప్రాంతంలో భైంసా సమీపంలో ఇదేవాగుపై ప్రాజెక్టును నిర్మించారు. పట్టణ ప్రజలకు శాశ్వతంగా తాగునీరు అందిస్తూ భైంసా, లోకేశ్వరం మండలాల్లోని 14 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టుగా నామకరణం చేసి మహారాష్టవ్రైపు నుండి వచ్చే నీటిని ఇక్కడే నిల్వచేసి ఉంచుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో చుచుంద్ గ్రామం పూర్తిగా ముంపునకు గురైంది. భైంసా మండలం లింగా, కుండి, చుచుంద్, కుభీర్ మండలం సాంలీ, వాయి, నిగ్వా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. చుచుంద్ గ్రామానికి పక్కనే పునరావాసం కల్పించారు. ప్రాజెక్టు నీరు ఎళ్లవేలల ఉండడంతో వాగుపైపు నుండి వేళ్లే రోడ్డు ఎప్పుడు నీటిలోనే మునిగి ఉంటుంది. దీంతో చుచుంద్ గ్రామానికి మాంజ్రి, పాంగ్రా గ్రామాల మీదుగా రోడ్డును నిర్మించారు. కొత్త రోడ్డు నిర్మాణంతో అక్కడికి వెళ్లే భక్తుల సంఖ్య క్రమేనా తగ్గింది. చరిత్రకు సాక్షంగా నిలిచిన ఈ ఆలయం కూలిపోయే పరిస్థితి వచ్చింది. సిద్దేశ్వర ఆలయానికి వెళ్లగానే రెండువైపుల రాతి స్థంభాలు కనిపిస్తాయి. ఈ స్థంభాలు ఎక్కేందుకు బయట నుండి మెట్లను పోలిన బండలు కనిపిస్తాయి. క్రమేనా రాతి స్థంభాలకు ఉన్న బండలు కూలుతున్నాయి. నిర్మల్ చుట్టూ ఉన్న కోటలను పర్యాటకంగా అభివృద్ది చ్తేమని చెప్పిన అధికారులు కొద్ది రోజులే అక్కడ కౌంటర్‌లు తెరిచి నేడు మూలనపారేశారు. ఇలాంటి ఆలయాలను కాపాడాల్సిన అవసరం ఉందని నిర్మల్ జిల్లావాసులు కోరుతున్నారు.