అదిలాబాద్

జెడ్పీ ఛైర్మెన్ పదవి రేసులో కోవలక్ష్మి ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, మార్చి 8: గిరిజన మహిళకు కేటాయించిన కుమరం భీం జిల్లా జెడ్పీ చైర్మన్ సీటుపై మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి కనే్నసినట్లు అర్థమవుతోంది. రెండే నియోజక వర్గాలున్న జిల్లాలో ఛైర్మెన్ పదవికి తీవ్ర పోటీ నెలకొందనేది స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి పాలైన కోవలక్ష్మితోపాటు ఆమె సోదరి ఇటీవల తెరాసలో చేరిన మర్సుకోల సరస్వతి సైతం ఛైర్మెన్ పదవి ఆశించే అవకాశాలున్నాయనే చర్చ వినిపిస్తోంది. కాని తెరాసలోని ఓ వర్గం మాత్రం మెజారిటీ స్థానాలు తెరాస ఖాతాలో చేరితే గనక ఛైర్మెన్ పీఠం కోవలక్ష్మినే వరిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైన కోవలక్ష్మి రాజకీయంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆసిఫాబాద్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన ఆత్రం సక్కు త్వరలోనే అధికార పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికి అధిష్టానం నామినేటెడ్ పదవి ఇస్తుందేమో అన్న ఆశతో ఉన్న కోవలక్ష్మికి ఆత్రం సక్కు చేరిక మింగుడు పడడం లేదు. తాజాపరిణామాలు ఆమె రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు అలుముకున్నాయనే వాదనలు వినిపించాయి. ఇదే తరుణంలో కుమరం భీం జిల్లా జిల్లాపరిషత్ ఛైర్మెన్ స్థానాన్ని గిరిజన మహిళకు కేటాయించడంతో కోవలక్ష్మి ఆశలు చిగురించాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ జిల్లా పరిషత్ ఛైర్మెన్ పదవిని చేజిక్కించుకుని రాజకీయంగా తిరిగి నిలదొక్కుకోవాలనే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఆమె జెనరల్ స్థానమైన ఆసిఫాబాద్, గిరిజన అభ్యర్థులకు కేటాయించిన కెరమెరి, జైనూర్, తిర్యాణి స్థానాల్లో ఏ ఒక్క చోటు నుండైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కుమరం భీం జిల్లాలో 15 జెడ్పీటిసి స్థానాలు ఉన్నాయి. ఎనిమిది స్థానాలు ఉన్న పార్టీ అభ్యర్థినే జెడ్పీ పీఠం వరించనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో మెజారిటీ జెడ్పీటిసి స్థానాలు తమ పార్టీకే దక్కవచ్చన్న ధీమా గులాబీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఎమ్మెల్యే ఆత్రం సక్కు పార్టీ వీడడంతో కాంగ్రెస్ మరింత బలహీన పడిందనే చెప్పవచ్చు. జిల్లాలో ఉన్న రెండు నియోజక వర్గాల్లోనూ అధికార పార్టీకి పోటీ ఇచ్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదనే చెప్పాలి. అవకాశాలు అనుకూలంగా ఉన్నప్పటికి జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకున్న వ్యక్తే ఛైర్మెన్ పీఠంపై కూర్చునే అవకాశాలున్నాయి. ఈనేపథ్యంలో కీలకమైన ఈపదవిని తనకే ఇవ్వాలంటూ కోవలక్ష్మి అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఇటీవలి ఎమ్మెల్యే ఎన్నికల్లో కొంత మంది కింది స్థాయి నేతల వల్లే తాను ఓటమి పాలైనట్లు ఆవేదన వెలిబుచ్చిన కోవలక్ష్మి నామినేటెడ్ పదవి కోసం ఆశిస్తోంది. ఈనేపథ్యంలో అధిష్టానం సైతం ఛైర్మెన్ పదవికి ఈమాజీ ఎమ్మెల్యే పేరును పరిశీలించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
వైస్ ఛైర్మెన్ రేసులో అరిగెల నాగేశ్వర్‌రావు?
జిల్లా జెడ్పీ పీఠం గిరిజన మహిళకు కేటాయించడంతో, వైస్ ఛైర్మెన్ పోస్టుకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈపోస్టుపై మహామహులు కనే్నసినట్లు అర్థమవుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా ఇంచార్జిగా వ్యవహరించిన అరిగెల నాగేశ్వర్‌రావుటి ఆర్ ఎస్ అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈనేపథ్యంలో తనకు ఎమ్మెల్సీ లేదా కీలకమైన నామినేటెడ్ పదవి దక్కుతుందనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పట్లో పదవుల ఊసు లేక పోవడంతో అరిగెల జిల్లా జెడ్పీ వైస్‌ఛైర్మెన్ పీఠంపై కనే్నయవచ్చనే చర్చ జోరుగా వినిపిస్తోంది. ఆసిఫాబాద్ జనరల్ అభ్యర్థికి కేటాయించిన ఆసిఫాబాద్, వాంకిడి స్థానాల నుండి అరిగెల బరిలో దిగవచ్చనే వాదనలున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే సక్కు వెంట తెరాసలో చేరనున్న ఒకరిద్దరు నేతలు సైతం వైస్ ఛైర్మెన్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం.

8 ఎన్ ఆర్ ఎంపి 14: సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
8 ఎన్ ఆర్ ఎంపి 15: పొన్కల్ గ్రామపంచయతీకీ హరీష్‌కుమార్ చెక్కు అందజేస్తున్న దృశ్యం
పారిశుద్ధ్య నిర్వహణ కోసం విరాళం అందించడం అభినందనీయం
* రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
* పొన్కల్ వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అల్లోల
మామడ, మార్చి 8: గ్రామ పారిశుద్ధ్య నిర్వహణ కోసం పొన్కల్ గ్రామానికి చెందిన రాష్ట్ర ఉపాధిహామీ మండలి సభ్యులు చిక్యాల హరీష్‌కుమార్ ఐదు సంవత్సరాల పాటు నెలకు రూ.10 వేలు గ్రామపంచాయతీకి అందించడం అభినందనీయమని రాష్ట్ర అటవీ,పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పొన్కల్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండవసారి మంత్రి పదవి చేపట్టి గ్రామానికి రావడంతో గ్రామస్థులకు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సదర్‌మాట్ మినీ బ్యారేజ్ నిర్మాణంలో ముంపునకు గురైన భూములకు త్వరలో నష్టపరిహారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేయడానికి కృషిచేస్తానన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని ఆయన పేర్కొన్నారు. పారిశుద్య నిర్వహణ కోసం రెండు నెలలకు సంబంధించిన రూ.20వేల చెక్కును హరీష్‌కుమార్ మంత్రి చేతులమీదుగా సర్పంచ్ భూమేశ్వర్‌కు అందజేశారు. అనంతరం గ్రామస్థులు మంత్రిని సన్మానించారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మండల పాత్రికేయ సంఘం తరపున మంత్రి అల్లోల చేతులమీదుగా పరీక్ష ప్యాడ్‌లు, పెన్నులను అందించారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో విద్యార్థులకు ఈ విరాళాన్ని అందించడం జరిగిందని సంఘ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూమేశ్వర్, నిర్మల్ ఎఫ్‌ఎసీఎస్ చైర్మెన్ రాంకిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ కాలగిరి గంగారెడ్డి, సదర్‌మాట్ బ్యారేజ్ కాంట్రాక్టర్ విజయ్ భాస్కర్‌రెడ్డి, ఉప సర్పంచ్ నరేష్‌రెడ్డి, నాయకులు లింగన్న, గంగన్న, రవి, హన్మంత్‌రావు, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి
ప్రపంచ మహిళా దినోత్సవంలో కలెక్టర్ దివ్య దేవరాజన్
8ఏడిబిపి5: మహిళా ఉద్యోగులకు మెమోంటోలు అందజేస్తున్న కలెక్టర్ దివ్య
ఆదిలాబాద్ మున్సిపాలిటీ, మార్చి 8: నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. శుక్రవారం ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మహిళలు మనోబలంలో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ అందరికి ఆదర్శంగా నిలువాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆత్మస్థైర్యంతో కుటుంబ, పిల్లల స్థితిగతులను చూస్తూనే ఉద్యోగాల్లో రాణించడం మహిళలకే సాధ్యమన్నారు. అబ్బాయిలతో సమానంగా ఆడ పిల్లలను చూడాలని, బాలికల చదువులపై నిర్లక్ష్యం వహించరాదని, ఉన్నత చదువుల్లో రాణించేలా వారిని ప్రోత్సహించాలన్నారు. మహిళలు ఆదిలాబాద్ డిపోలు కండక్టర్లుగా ఉద్యోగం నిర్వర్తించడం అభినందనీయమని అన్నారు. మహిళా కండక్టర్లను ఆదర్శంగా తీసుకొని మహిళా డ్రైవర్లుగా రావాలని కోరారు. ప్రభుత్వం సైతం మహిళలకు పెద్ద పీట వేస్తుందని, రాజకీయ రంగాల్లో సైతం ముందుండాలన్నారు. త్వరలోనే మహిళలకు ఆటోలు అందిస్తామని అన్నారు. అనంతరం ఉద్యోగ రంగాల్లో రాణించిన పలువురు మహిళ ఉద్యోగులను కలెక్టర్ అభినందిస్తూ మెమోంటోలతో పాటు సత్కరించారు. ఈకార్యక్రమంలో డిపో మేనేజర్ శంకర్‌రావు, సహాయ మేనేజర్ (ట్రాఫిక్) కల్పన, డిపో సిబ్బంది, మహిళా కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

సన్నాహక సమావేశానికి 20వేల మంది సమీకరణ
14న కేటీఆర్ సభ విజయవంతానికి అల్లోల పిలుపు
డైట్ మైదానంలో ఏర్పాట్ల పరిశీలన
8ఏడిబిపి4: డైట్ మైదానంలో సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి ఐకెరెడ్డి, జోగురామన్న, రాథోడ్ బాపురావు, ఎంపి నగేష్
5: దేవాదాయ శాఖ మత్రి ఐకెరెడ్డి, ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, జోగురామన్నలను సన్మానిస్తున్న దృశ్యం
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, మార్చి 8: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని, ఈనెల 14న ఆదిలాబాద్‌లో జరిగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి ఆర్ సభను విజయవంతం చేసే బాధ్యత కార్యకర్తలపై ఉందని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా శుక్రవారం ఆదిలాబాద్‌కు వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు, ఎంపి నగేష్, పార్టీ సీనియర్లతో కలిసి పార్లమెంట్ సన్నాహక సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం జనార్ధన్ రెడ్డి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి ఐకెరెడ్డి మాట్లాడుతూ డైట్ మైదానంలో జరిగే సన్నాహక సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హాజరవుతున్నారని అన్నారు. 20వేల మంది కార్యకర్తలతో సన్నాహక సభ నిర్వహిస్తామని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వానికి ప్రజలు బలపర్చడం జరిగిందని, అదే సమరోత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ పార్టీ ఘన విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లు తమ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తారని, ప్రభుత్వం గ్రామాల అభివృద్ది కోసం భారీ ఎత్తున నిధులు కేటాయిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పార్టీ క్యాడర్‌ను సమన్వయపర్చి జిల్లాలోని ఏడుగురు ఎమ్మెల్యేలు బాధ్యతతో ముందుకు సాగుతామని అన్నారు. ఆదిలాబాద్, బోథ్ నియోకవర్గానికి సన్నాహక సభా స్థలి దగ్గరగా ఉన్నందునా ఈ రెండు నియోజకవర్గాల నుండి పది వేల మంది కార్యకర్తలను సమీకరించుకోవాలని, ముథోల్, నిర్మల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్‌టి నియోజకవర్గాల నుండి మిగితా పది వేల మంది హాజరుకానున్నట్లు ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ, అభివృద్ది పథకాలకు సార్థకత చేకూరాలంటే టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలో రెండు రోజులు జిల్లాలో పర్యటించనున్నారని, దీంతో గతంలో ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యలు పరిష్కారం కానున్నాయని అన్నారు. ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సంకీర్ణ కూటమి విజయం సాధిస్తుందని, బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు మెజార్టీ దక్కే అవకాశం లేదన్నారు. ఢిల్లీని శాసించాలంటే తెలంగాణ రాష్ట్రంలోని 16 లోక్‌సభ స్థానాలతో పాటు ఎంఐఎం బలపర్చిన హైదరాబాద్ స్థానాన్ని గెలిపించుకొని తీరాలని పిలుపునిచ్చారు. 14న జరిగే సభకు ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి ఐదు వేల మంది కార్యకర్తలను సమీకరిస్తున్నట్లు రామన్న స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడ్డి బోజారెడ్డి, దామోదర్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మహిళల ఆత్మగౌరవం, అభ్యున్నతికి ప్రతీ ఒక్కరు కృషిచేయాలి
* మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
* రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్, మార్చి 8: మహిళల ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం ప్రతీ ఒక్కరు కృషిచేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీ ఎం కేసీఆర్ మహిళలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్ల పుట్టినప్పటి నుండి వారికి ఆసరా పెన్షన్ ఇచ్చే వరకు ప్రతీ స్థాయిలో చేయూతనిస్తూ వారి సంక్షేమం, అభివృద్ది కోసం నిరంతరం పాటుపడుతోందన్నారు. మహిళా భద్రతకు పెద్దపీఠ వేస్తూ షీ టీమ్స్‌ను ఏర్పాటుచేసి వారికి అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.

పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి
* వీడియో కాన్ఫరెన్స్‌లో నోడల్ అధికారుల దిశానిర్దేశం

నిర్మల్,మార్చి8: రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నోడల్ అధికారులు కలెక్టర్ దివ్య, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌లు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో నాలుగు జిల్లాల పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యాత్మక గ్రామాలను పోలీసు అధికారులు సందర్శించాలని, ఎన్నికలు నిర్వహించడానికి ఓటర్ల అవగాహణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఉమ్మడి జిల్లాల పోలీసు అధికారులు కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించాలన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాలో ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్రీ అండ్ ఫేయిర్ పద్దతిన ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు, అదనపు ఎస్పీ దక్షిణామూర్తి, డీ ఎస్పీలు ఉపేంధర్‌రెడ్డి, రాజేష్ భల్లా, స్పెల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ ఎం. ఎ కరీం, సీ ఐలు జాన్‌దివాకర్, అశోక్, ప్రవీన్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

8 ఎఎస్‌ఎఫ్ 6. ఇవిఎంలను పరిశీలిస్తున్న కలెక్టర్
ఈవిఎంల పనితీరును పరిశీలించిన కలెక్టర్
ఆసిఫాబాద్ టౌన్, మార్చి 8: పార్లమెంటు ఎన్నికల్లో ఉపయోగించునున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు శుక్రవారం పరిశీలించారు. మార్కెట్ కమిటి గోడౌన్‌లో బధ్రపరిచిన ఈయంత్రాల మొదటి లెవల్ చెకింగ్‌ను పూర్తి చేసి రాజకీయ పార్టీల నేతల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఓటింగ్ సమయంలో గుర్తుకనిపించే విధంగా ఈమిషన్లను రూపొందించినట్లు తెలిపారు. ఓటు వేసిన గుర్తును సైతం ఓటరు చూసుకోవచ్చన్నారు. ఈకార్యక్రమంలో జెసి రాంబాబు, ఆయా పార్టీల నేతలు పాల్గొన్నారు.
8 ఎఎస్‌ఎఫ్ 1. పల్స్‌పోలియో ర్యాలీని ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో కొమురం బాలు
పల్స్ పోలియో నిర్మూలనకు కృషి చేద్దాం
* డీఎంహెచ్‌వో కుమరం బాలు
ఆసిఫాబాద్, మార్చి 8: మానవాళి పాలిట శాపంగా పరిణమించిన పోలియో మహమ్మారిని నిర్మూలించేందుకు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కుమరం బాలు పిలుపునిచ్చారు. ఈనెల 10వ తేదీన జిల్లాలో నిర్వహించ తలపెట్టిన పల్స్‌పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని డీఎంహెచ్‌వో కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించారు. పచ్చ చెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన అనంతరం డీఎంహెచ్‌వో బాలు మాట్లాడుతూ పోలియో వ్యాధిని సమూలంగా నిర్వహించేందుకు 1995లో తొలిసారిగా పల్స్‌పోలియో ఇమ్యునైజేషన్ నిర్వహించినట్లు తెలిపారు. చివరి పల్స్‌పోలియో కేసు 2011లో నమోదైనట్లు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మేరకు పోలియోపై నిరంతర పర్యవేక్షణ జరుగుతుందన్నారు. సరిహద్దు దేశాలపైన పాకిస్థాన్, అఫ్ఘానిస్తాన్, నైజీరియా తదితర దేశాల్లో 27 పోలియో కేసులు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తమై ముందుజాగ్రత్తగా పల్స్‌పోలియో నిర్వహిస్తుందన్నారు. పోలియోను నివారించేందుకు చుక్కలు, ఇంజక్షన్‌ల ద్వారా మందులు అందిస్తున్నట్లు డిఎంహెచ్‌ఓ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రజలు తప్పని సరిగా 0నుండి 5 సంవత్సరాల లోపుచిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. అనంతరం ప్రోగ్రాం అధికారి డాక్టర్ సీతారాం మాట్లాడుతూ పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో 54733 మంది 0నుండి 5 సంవత్సరాల లోపుచిన్నారులు ఉన్నారన్నారు. 10వ తేదీన నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమంలో ఈచిన్నారులకు చుక్కలు వేసేందుకు 464 బూతులు, 928 టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈటీంలలో 1856 సిబ్బంది, 74 మంది సూపరవైజర్లు విదులు నిర్వర్తిస్తారని ఆయన పేర్కొన్నారు. ఏ ఒక్కరికి చుక్కల మందు తప్పకుండా బస్టాండ్, రైల్వేస్టేషన్లు, జాతర, సంతలలో పోలియో కేంద్రాలను నిర్వహిస్తున్నామన్నారు. హైరిస్క్ ప్రాంతాలు, సంచార జాతులు నివసిస్తున్న ప్రాంతాల్లో చుక్కల మందు వేసేందుకు 19 మొబైల్ బృందాలు పని చేస్తాయన్నారు. కావున ప్రజలు తప్పకుండా తమ పిల్లలకు పోలియో మందులు వేయించాలన్నారు. అదే విధంగా 10వ తేదీన చుక్కలు వేయించుకోని చిన్నారుల కోసం 11,12వ తేదీల్లో సిబ్బంది ఇంటింటి వెల్లి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. ఈసమావేశంలో ఈకార్యక్రమంలో అధికారి సుబ్రహ్మణియం, డాక్టర్ సత్యనారాయణ, హెచ్‌ఇఓ కృష్ణ, హెచ్‌ఎస్ భీమన్న, హెచ్‌ఇ దేవీదాస్, విద్యా