అదిలాబాద్

తాగునీటి కోసం మహిళల రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్ టౌన్, అక్టోబర్ 10: తాగునీటి కోసం న్యూ రాజంపేట, చెక్‌పోస్టు కాలనీకి చెందిన మహిళలు గురువారం రోడ్డెకారు. గత పదిహేను రోజులుగా నల్లాలు రాక పోవడంతో బిందెడు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెల్లినా ఫలితం లేక పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాన రహదారిపై అరగంటపాటు బైఠాయించారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసమాచారం తెలుసుకున్న ఎస్‌హెచ్ ఓ రాజు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళలను సముదాయించారు. సంబందిత అధికారులతో మాట్లాడి నల్లా నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు. దీంతో ట్రాఫిక్ అంతరాయాన్ని తొలగించారు.

బోరిగామలో సీసీ కెమెరాల ఏర్పాటు
ఇచ్చోడ,అక్టోబర్ 10: మండలంలోని బోరిగామ గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఉట్నూరు డిఎస్పీ డేవిడ్ గురువారం ప్రారంభించారు. ఈ సంధర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా నేరాలను నియంత్రించుకోవచ్చని అన్నారు. పది మంది పోలీసులు చేయలేని కార్యాన్ని ఒక సీసీ కెమెరా ద్వారా చేపట్టగల్గుతామని ఆయన అన్నారు. అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే దోపిడి దొంగతనాలను అరికట్టుకోవచ్చని, సీసీ కెమెరాలు పోలీసు స్టేషన్‌తో అనుసంధానమై ఉంటాయని అన్నారు. గ్రామాల్లో ఏపాటి గొడవలు జరిగిన నేరుగా పోలీసు స్టేషన్‌కు అనుసంధానమైన సీసీ కెమెరాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ సిఐ శ్రీనివాస్, ఎస్సై పుల్లయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

సోయా కొనుగోళ్లు ప్రారంభం
కుభీర్, అక్టోబర్ 10: మండల కేంద్రంలోని మార్కెట్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మార్కెట్ కమిటి అధ్యక్షురాలు ఎనె్నల రాజకుమారి, మండల అధ్యక్షురాలు తూము లక్ష్మీబాయితో కలిసి సోయా కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను ప్రభుత్వ పరంగా మద్దతు ధరకే కొనుగోలు జరిగేలా చర్యలు చేపడుతామన్నారు. కొత్తగా పాస్‌పుస్తకాలు పొందిన రైతు సోదరులు రైతు భీమా చేయించుకోవాలని సూచించారు. రైతులకు మార్కెట్ యార్డులో సౌకర్యాలు కలిప్చడం జరుగుతుందన్నారు. మార్కెట్‌కు రైతులు నాణ్యమైన పంటలు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ప్రైవేటు వ్యాపారులు సోయా క్వింటాళ్‌కు రూ.3610 చొప్పున కొనుగోళ్లు చేశారు. కొనుగోళ్ల ప్రారంభ సమయంలో మండల అద్యక్షురాలు తూము లక్ష్మీబాయి, మార్కెట్ కమిటి అధ్యక్షురాలు ఎనె్నల రాజకుమారి తెరాసా జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, మండల కన్వీనర్ ఎన్నిల అనీల్, మార్కెట్ కమిటి వైస్ చైర్మెణ్ బంక దత్తు, శివుని సర్పంచ్ దత్తురామ్ పటేల్, వ్యాపారులు సంతోష్, రఫిక్, అప్సర్, మార్కెట్ కమిటి డైరెక్టర్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటి సెక్రటరీ ప్రవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.