అదిలాబాద్

సింగరేణి.. జెన్కో... రెండూ ప్రభుత్వరంగ సంస్థలే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, డిసెంబర్ 26: జైపూర్‌లో సింగరేణి నిర్మిస్తున్న 1200 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు నిర్వహణ బాధ్యతలను జెన్కోకు అప్పగించే విషయంలో స్లానిక భూ నిర్వాసితుల్లో ఆందోళన మొదలయింది. సింగరేణి మరియు జెన్కోలు రెండూ ప్రభుత్వరంగ సంస్థలేకావటంతో ప్లాంట్‌లో ఉద్యోగాల నియామకంలో ప్రభుత్వవిధానాలను పాటించాలని కోరుతున్నారు. ముఖ్యంగా భారీ ప్లాంటు నిర్మాణంకోసం అవసరమయిన దానికన్నా రెట్టింపు భూములను కంపెనీకి భూనిర్వాసితులు అప్పగించారు. ఆ సమయంలో స్థానికులకు నిమంధనల మేరకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని సంస్థ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. ప్రస్థుతం మాత్రం తమకు ప్లాంటు నిర్వహణ విశయంలో అనుభవం లేదనే సాకుతో నిర్వహణ బాధ్యతలను జెన్కోకు అప్పగించనుందనే విమర్శలున్నాయి. ఈ విషయంలో తమకు సమీపంలోఉన్న భూపాలపల్లిలో జెన్కో నిర్మిస్తున్న ప్లాంటుల్లో అక్కడి నిర్వాసితులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారో అదేవిధంగా ఇక్కడా అదే విధానం పాటించాలని నిర్వాసితులు కోరుతున్నారు. భూపాలపల్లి ప్లాంటు కోసం భూములిచ్చిన భూనిర్వాసితులకు వారి విద్యార్హతల మేరకు వారికి పరిమనెంటుతో పాటు టెంపరరీ ఉద్యోగాలు ఇచ్చారని అదే విధానాన్ని ఇక్కడ కూడా కొనసాగించాలని కోరుతున్నారు. పెద్ద పెద్ద శబ్దాలతోపాటు కాలుష్యం, వేడితో భవిష్యత్తులో పరిసరగ్రామాల ప్రజలకు మనుగడ ప్రశ్నార్థకమయ్యే అవకాశాలున్నాయని, ఇవన్నిటిని త్యాగాలుచేసిన ప్రజలకు ఉపాధి కల్పించనట్లయితే తాము ఆందోళన చేపట్టనున్నట్లు భూ నిర్వాసితుల సంఘం బాధ్యులు రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసి మంతెన లక్ష్కణ్‌తోపాటు ప్రభావిత గ్రామాల సర్పంచులు స్పష్టం చేశారు. భూపాలపల్లి ప్లాంటుల్లో ఉద్యోగాల విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారో అలా వ్యవహరించనట్లయితే పార్టీల కతీతంగా తాము ఉద్యమించటంతోపాటు ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఓదెలు సహకారంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని తెలిపారు.