అదిలాబాద్

అభివృద్ధి పనులకు భూమి పూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్చోడ, మే 10: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు నిధులను విడుదల చేస్తోందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. మంగళవారం మండలంలోని ఆయా గ్రామాల్లో సుమారు రూ.78లక్షల నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం గుండాల గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసంగించారు. చించోలి గ్రామ రోడ్డు మరమ్మత్తులకు రూ.35లక్షలు, గుండాల గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి రూ. 13లక్షలు, సిరిచెల్మలోని మల్లికార్జున స్వామి శివాలయ మరమ్మత్తులకు దేవాదాయ శాఖ ద్వారా రూ.30లక్షల నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. సిరిచెల్మ గ్రామంలోని అతి పురాతనమైన శివాలయం గత సమైక్య పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పటి వరకు ఆలయ అభివృద్ధికి నయపైసా కూడా మంజూరు చేయలేదన్నారు. దేవాలయాల అభివృద్దికి ముఖ్యమంత్రి కెసి ఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని, దేవాలయాలను అభివృద్ధి పరిస్తేనే గ్రామాల్లోని ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందడంతో పాటు మంచి వాతావరణంలో అభివృద్ధి సాధించే అవకాశాలు ఉంటాయని అన్నారు. పంచాయతీలకు సొంత భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దశల వారీగా అన్ని గ్రామపంచాయతీలకు సొంత భవనాలు నిర్మించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలపై దృష్టిసారిస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ మండల కన్వీనర్ గాడ్గె సుభాష్, గుండాల పిఏసిహెచ్ చైర్మెన్ అబ్దుల్ రషీద్, పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మిరాజ్ ఆహ్మాద్, ప్రకాష్, రవీందర్, కన్నమయ్య పాల్గొన్నారు.