అదిలాబాద్

భర్త విడాకులతో భార్య ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిర్పూర్(టి), మే 12: సిర్పూర్‌టి మండలంలోని టోంకిని సమీపంలో పెన్‌గంగాలో భర్త విడాకులు ఇవ్వడంతో భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రెబ్బెన మండలంలోని ఇందిరా నగర్‌కు చెందిన మోర్లె అనిత (38) ఆమె భర్త మోర్లె సురేష్ విడాకులు ఇవ్వడంతో మనస్థాపం చెందిన ఆమె మంగళవారం టోంకిని సమీపంలోని పెన్‌గంగాలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం పెన్‌గంగా ప్రాంతంలో శవం నీటి నుంచి బయటికి రాగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు మృతురాలి అన్న ధర్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు.