అదిలాబాద్

ఖరీఫ్‌కు సన్నద్ధం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, మే 12: నిర్మల్ వ్యవసాయ డివిజన్ పరిధిలో 2016-17 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ ప్రణాళికలు అధికారులు సిద్దం చేశారు. డివిజన్ పరిధిలోని నిర్మల్, దిలావర్‌పూర్, సారంగాపూర్, కుంటాల మండలాల్లో ఎక్కువగా వరి, మొక్కజొన్న, సోయాబీన్, పసుపు, పత్తి, జొన్న, నువ్వులు, పప్పు దినుసులు, సన్‌ఫ్లవర్, ఇతర కూరగాయల పంటలను ఎక్కువగా సాగుచేస్తారు. ఆయా మండలాల పరిధిలోని అన్ని గ్రామాల్లో సారవంతమైన భూములు ఎక్కువగా ఉండడంతో అన్ని రకాల పంటలు పండుతాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద సరస్వతి కాలువ ద్వారా దాదాపు 35 వేల ఎకరాలు, అలాగే స్వర్ణా ప్రాజెక్టు ద్వారా జౌళినాల ద్వారా కుడి, ఎడమ కాలువల ద్వారా 10 వేల ఎకరాలు, చెరువులు, కుంటల కింద దాదాపు 25 వేల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగవుతాయి. వీటితోపాటు బోరుబావుల కింద కూడా వరి,మొక్కజొన్న, సోయాబీన్, తదితర పంటలను పండిస్తారు. ఖరీఫ్‌లో రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను వ్యవసాయశాఖ అధికారులు సిద్దంగా ఉంచారు. ఈ నెల 20 నుండి అన్ని పంటల విత్తనాలను పంపిణి చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.
సేంద్రియ సాగుకే మొగ్గు....
రసాయన ఎరువుల వాడకం తగ్గించడానికి సేంద్రియ ఎరువులతోనే సాగుచేయాలని వ్యవసాయశాఖ అధికారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల రైతులకు కలిగే లాభాలను వివరిస్తూ గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం భూమి సారవంతం కావడానికి పంటలకు ముందుగా అవసరమయ్యే జీలుగ, జనుము, పిల్లి పెసర, విత్తనాలను 50 శాతం రాయితీతో అందజేస్తున్నారు. నిర్మల్ డివిజన్ పరిధిలో ఆయావిత్తనాలను పంపిణి చేసేందుకు జీలుగ 850 క్వింటాళ్లు, జనుము 800 క్వింటాళ్లు, పిల్లిపెసర 240 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచారు.
పత్తిపంట సాగును తగ్గించాలని ప్రచారం....
అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి ఎగుమతులు, దిగుమతులు తగ్గిన నేపథ్యంలో ఈసారి పత్తిపంట విస్తీర్ణాన్ని తగ్గించి పప్పు దినుసులు, నూనెగింజల పంటలు అధికంగా సాగుచేయాలని వ్యవసాయశాఖ అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో నిర్వహించే రైతు సదస్సుల్లో ఈమేరకు అవగాహన కల్పిస్తున్నారు. ఈయేడు వర్షాలు సాధారణం కంటే అధికంగా కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించడంతో అన్నదాతలు ఖరీఫ్ సాగుకు సన్నద్దం కావాలని అధికారులు సూచిస్తున్నారు.
అందుబాటులో విత్తనాలు... ఎడి ఎ వినయ్‌బాబు...
ఖరీఫ్‌లో వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. సోయా 10200 క్వింటాళ్లు, వరి 1200 క్వింటాళ్లు, కందులు 80, పెసర్లు 40, మినుములు 135, మొక్కజొన్న విత్తనాలు 500 క్వింటాళ్ల వరకు పంపిణికి సిద్దంగా ఉన్నాయి. ఈ నెల 20 నుండి పంపిణి చేసి ఎరువుల కొరత లేకుండా చూస్తాం. అంతేకాకుండా ఈసారి పంటలకు మామూలు యూరియా బదులుగా వేప సంబంధిత యూరియాను పంపిణి చేయడం జరుగుతుంది. రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.