అదిలాబాద్

రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం రుణాలు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, మే 12: గిరిజన ప్రాంతాల్లోని రైతులకు రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం ఖరీఫ్ సాగుకు ముందే పంట రుణాలు అందించాలని ఐటిడిఏ పివో ఆర్‌వి కర్ణన్ బ్యాంకు అధికారులకు సూచించారు. గురువారం స్థానిక పి ఎమ్మార్సీ భవనంలో బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా పివో కర్ణన్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో పట్టా భూములు, అటవీ హక్కు పత్రాలు కలిగిన రైతులకు ఖరీఫ్ సాగుకు ముందే పంట రుణాలు అందించాలని అన్నారు. ప్రైవేట్ దళారులు, వడ్డీ వ్యాపారస్తులు భారీన పడకుండా గ్రామాల్లోని రైతులకు పంట రుణాలను అందించాలని అన్నారు. బ్యాంకు అధికారులు గ్రామాల్లోకి వెళ్ళి రుణమేళాతో పాటు క్యాంపులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా రైతుల జాబితాను తయారు చేసి పేదరిక నిర్మూలన సంస్థకు అందజేయాలని అన్నారు. గతంలో తీసుకున్న రుణాలు రైతులు పూర్తిగా చెల్లించాలని, లేనిచో ఇన్సూరెన్స్ సదుపాయం కోల్పోతారని అన్నారు. పసల్‌బీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పివో కోరారు. ఉట్నూరు, నార్నూర్, సిర్పూర్‌యు, జైనూర్, ఇంద్రవెల్లి, కెరమెరి మండలాల్లోని పంట రుణాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో నాబార్డు ఏజి ఎం పురోహిత్, ఎల్‌డి ఎం ధర్మనాయక్, ఉట్నూరు ఎంపిడీవో లక్ష్మణ్, ఏపివో జనరల్ నాగోరావు, వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు ఇంద్రసేన్ పాల్గొన్నారు.