అదిలాబాద్

తుమ్మిడిహెట్టికి అనుమతులపై హర్షాతిరేఖాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌటాల, జూలై 3: వార్దా, వైన్‌గంగల సంగమ స్థానం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు రావడంపై సర్వత్రా హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 2008 డిసెంబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భూమిపూజ చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవేళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ప్రధాన డిమాండ్లతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తరుణంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సమైఖ్య పాలనలో తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో ప్రాజెక్టు ద్వారా పొరుగు రాష్ట్రాలతో సవాలక్ష పేచీలు ఉంటాయని గ్రహించి రీ డిజైనింగ్‌కు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా గతంలో 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టి తెలంగాణవ్యాప్తంగా పది జిల్లాల్లో 16.40లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 28 ప్యాకేజీలుగా ఈ పనులను టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు కొనసాగించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం ఈ పనులపై ఒక్కసారిగా సందిగ్ధం నెలకొంది. ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్టత్రో సఖ్యతగా మెలుగుతూ తెలంగాణవ్యాప్తంగా ప్రాణహిత, గోదావరి జలాల నీటి వాటం వినియోగించుకోవాలన్న సంకల్పంతో కాళేశ్వరం సమీపంలోని మేడి గడ్డ వద్ద భారీ ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఈ క్రమంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కథ ముగిసిందనే ప్రచారంతో కాంగ్రెస్, తెలుగుదేశం, వామపక్షాలు సహా ప్రజా సంఘాలు, ప్రాణహిత జల సాధన సమితి, తెలంగాణ ప్రజాఫ్రంట్ తదితర పార్టీలు, సంఘాలన్నీ తుమ్మిడిహెట్టి నుంచి ప్రాణహితను తరలించవద్దని, రీడిజైనింగ్ ప్రభుత్వ రాజకీయ లబ్దికోసమేనని, అనేక ఉద్యమాలు, పోరాటాలు సాగించాయి. ఈక్రమంలోనే ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయంలో కొంత ఆచితూచి స్పందించినా యేడాది క్రితం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లా హితం కోసం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిర్మించేందుకు అన్నివిధాలా కృషిచేస్తామని పేర్కొనడంతో పాటు అటు మేడిగడ్డను, ఇటు తుమ్మిడిహెట్టితో పాటు పెనాకకొరాట ప్రాజెక్టులపై సమగ్రంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈక్రమంలోనే ఇరురాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా విభేదాలను, సందేహాల నివృత్తికోసం అంతర్‌రాష్ట్ర జల మండలిని ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రుల ప్రాతినిథ్యంతో ఏర్పాటు చేశారు. ఈక్రమంలోనే మేడిగడ్డకు సంబంధించి భూమి పూజ ఇటీవలనే పూర్తిచేసిన ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావులు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంపై ప్రత్యేక దృష్టి నిలిపి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను మహారాష్ట్ర ప్రభుత్వంతో అనుమతుల విషయంపై చర్చించేందుకు విరామం లేకుండా ప్రయత్నాలు కొనసాగించారు. ఈక్రమంలోనే గత పదిహేను రోజుల క్రితం ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత కీలకమైన అటవీ, వన్యప్రాణి అనుమతులను మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అందించడంతో పాటు ప్రాజెక్టు బ్యారేజీ ఎత్తును 148 మీటర్లకు కుదిస్తే రాష్ట్రంలోని 160హెక్టార్ల సాగు భూమి మాత్రమే కోల్పోయే అవకాశం ఉన్నందున, దీనికి కూడా పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న హామీతో ఈ నెల 15న ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఒప్పందాలను పూర్తి చేసుకోనున్నారు. ఈ తీరుణంలోనే జూన్ 30న జీవో నెం.602 ద్వారా రూ.4602కోట్లతో పరిపాలన పరంగా అనుమతులను జారీ చేసింది. దీని ప్రకారం జిల్లాలో నూతనంగా ఏర్పడబోయే మంచిర్యాల జిల్లా పరిధిలో సిర్పూర్ నియోజకవర్గానికి 55200 ఎకరాలు, ఆసిఫాబాద్ నియోజకవర్గానికి 21900 ఎకరాలు, బెల్లంపల్లి నియోజకవర్గానికి 58900 ఎకరాలు, చెన్నూర్ నియోజకవర్గానికి 31500 ఎకరాలతో పాటు మంచిర్యాల నియోజకవర్గానికి 33500 ఎకరాలు, మొత్తం కలిపి 2లక్షల ఎకరాలు సాగు నీరు అందించేందుకు ప్రణాళికపరంగా అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే 2750 ఎకరాల కాల్వల నిర్మాణానికి భూ సేకరణ జరిగిన ఆదిలాబాద్, ప్రాణహిత ప్రాజెక్టు ప్రస్తుతం వెల్లడించిన ఆదేశాల ప్రకారం తూర్పు జిల్లావ్యాప్తంగా 41 గ్రామాల్లో సాగునీరు అందించనుండగా, బ్యారేజీ నిర్మాణంలో గతంలో ప్రతిపాదించిన స్థలానికి కొద్దిగా ముందుకు జరిగి 103గేట్లతో వర్షాకాలంలో వరద నీటిని మళ్లించుకునేందుకు అనువుగా మారనుంది. ఏదిఏమైనా వారు ఏడేళ్ల కాలం నత్తనడకన సాగిన పనులు ఏమైపోతాయోనని అనుకున్న కాల్వలు, చరిత్రకే పరిమితమవుతుందా అని అనుకున్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా పరంగా అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు, రైతులు ఈ పరిణామంపై హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నారు. మన నీళ్లు మనకేనన్న నినాదం ఫలించిందని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.