అదిలాబాద్

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్నారం, జూలై 8: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం రెండవ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభోత్సవం భాగంగా పోలీసు స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం అటవీ శాఖ టిడిసిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై స్వచ్చందంగా మొక్కలు నాటాలని, అదే విధంగా వాటి సంరక్షణకు బాధ్యత వహించాలన్నారు. నేడు వృక్ష సంపద కనుమరుగవడంతోనే వర్షాలు సకాలంలో కురియక కరవు కాటకాలు సంభవిస్తున్నాయని, రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మొక్కలు నాటాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో పాఠశాలల విద్యార్థులు సైతం ముందుండాలని, అదే విధంగా నాటిన మొక్కలను సంరక్షించాలని అన్నారు. నేడు మనం నాటే మొక్కలు రేపు వృక్షాలుగా మారి వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సిహెచ్ రాజేశ్వరి, పొన్కల మేజర్ గ్రామ సర్పంచ్ అనసూయ, ఎంపిటీసీ జోస్న, మండల పార్టీ అధ్యక్షులు జి.రాజరాం రెడ్డి, జిల్లా, మండల నాయకులు సిహెచ్ సత్యం, జనార్ధన్, కో ఆప్షన్ సభ్యుడు పసి ఉల్లా, టిఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి జాడి గంగాధర్, నాయకులు భరత్‌కుమార్, మున్వర్ అలితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.