అదిలాబాద్

కెరమెరిలో కుండపోత వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరమెరి, జూలై 22: కెరమెరి మండలంలో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏకదాటిగా కురిసిన భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షం కారణంగా మండల కేంద్రంలోని రోడ్లు, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు జలమయమయ్యాయి. కుండపోత వర్షంతో కెరమెరి మండలంలోని అట్టి గ్రామం వద్ద నిర్మిస్తున్న వంతెన పక్కన వేసిన తాత్కాలిక వంతెన రోడ్డు కోతకు గురి కావడంతో జిల్లా కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. 3గంటల నుంచి సాయంత్రం వరకు ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్‌కు, ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోవడంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట పొలాల్లో భారీగా నీరు చేరడంతో పంట పొలాలు వాగులను తలపిస్తున్నాయి. వరద నీటిలో పంటలు పూర్తిగా మునిగిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.