అదిలాబాద్

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, ఆగస్టు 21: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సిపిఐ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండా మల్లేష్ అన్నారు. ఆదివారం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎన్నికల్లో సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటికూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో మొదటి సిఎంను దళితున్ని చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ వర్గాన్ని మోసం చేశారని, అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఇప్పటివరకు ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌బెడ్ రూం పథకాల అమలులోపూర్తిగా విఫలమైందన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని, రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండా అని గొప్పలు చెప్పుకున్న కెసిఆర్ రైతుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. కెజి టు పీజి ఉచిత విద్య అందిస్తామని చెప్పి ఇప్పటివరకు దాని ఉసే లేదన్నారు. హరితహారం, మిషన్ కాకతీయ పథకాల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్ పేపర్‌మిల్లుతో పాటు సిసిఐ మూత పడడంతో వేల కుటుంబాలు ఉపాధి లేక రోడ్డునపడ్డారని, వీరి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవచూపకపోవడం సిగ్గుచేటన్నారు. అదేవిధంగా ప్రాజెక్టుల పేరిట రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తుందని, రైతులు అడిగిన మేరకు పరిహారం అందించి భూములు తీసుకోవాలని, లేనట్లయితే సిపిఐ అధ్వర్యంలో అందోళనలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సిపిఐ నాయకులు ముడుపు ప్రభాకర్ రెడ్డి, ఎస్.విలాస్, కుంటాల రాములు, కొండ రాజన్న, భాస్కర్, నర్సింగ్‌రావు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.