అదిలాబాద్

‘పల్లె’ ఉప ఎన్నికల్లో గులాబి పార్టీకి షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 8: జిల్లాలోని వాన్వట్ పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికతో పాటు ఐదు వార్డు స్థానాలకు గురువారం జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఊహించని రీతిలో పల్లె ఓటర్ల తీర్పు ప్రతిపక్షం వైపు మొగ్గుచూపడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మంత్రి జోగురామన్న ప్రాతినిథ్యం వహిస్తున్న వాన్వట్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్సకోల భీంబాయి, బిజెపి తరపున బరిలో నిలిచిన మడావి రాంబాయికి మధ్య హోరాహోరి పోటీ నెలకొనగా ఇరు పార్టీల నేతలు మూడు రోజులుగా సర్పంచ్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విస్తృత ప్రచారం గావించారు. అయితే ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన పోలింగ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ఫలితాలను వెల్లడించారు. ఆదిలాబాద్ మండలం వాన్వట్ గ్రామపంచాయతీలో మొత్తం 1174 మంది ఓటర్లు ఉండగా, 1008 ఓట్లు పోలయ్యాయి. నోటా కింద 29 ఓట్లు పడ్డాయి. అయితే బిజెపి గిరిజన మోర్చ నాయకుడు మాజీ జడ్పీటీసీ మడావి రాజు సతీమణి మడావి రాంబాయికి 624 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్ తరుపున బరిలోనిలిచిన మర్సుకోల భీంబాయికి 355 ఓట్లు పడ్డాయి. బిజెపి అభ్యర్థి ఊహించని విధంగా 269 ఓట్ల ఆధిక్యతతో ఘనవిజయం సాధించడంతో ఆ పార్టీ నేతల్లో సంబరాలు మిన్నంటాయి. గ్రామంలో బుధవారం రాత్రి టీఆర్‌ఎస్, బిజెపి నేతల మద్య ఘర్షణ చోటుచేసుకోగా గురువారం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లోని శాంతినగర్‌లో ఉన్న బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, గిరిజన నాయకుడు మడావి రాజు నివాస గృహాల వద్ద కార్యకర్తలు టపాసులు పేల్చి స్వీట్లు పంచుకుంటూ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. సర్పంచ్‌గా ఎన్నికైన మడావి రాంబాయిని, ఆమె భర్త మడావి రాజులను పూలమాలలతో అభినందిస్తూ సన్మానించారు. ఈ విజయం టీఆర్‌ఎస్ పతనానికి నాంది అని, ప్రజల తీర్పు ప్రభుత్వ విధానాలకు రెఫరెండంగా నిలుస్తాయని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జిల్లాలోని వివిధ కారణాలతో ఉప ఎన్నిక అనివార్యమైన ఐదు వార్డులకు గురువారం పోలింగ్ జరగగా మూడు స్థానాల్లో అధికారపార్టీయేతర సభ్యులు విజయం సాధించడం గమనార్హం. తాండూరు మండలం కొత్తపల్లి పంచాయతీ 13వ వార్డుకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి.రవి విజయం సాధించగా, రేచిన గ్రామంలోని 10వ వార్డులో టీఆర్‌ఎస్ తిరుగుబాటు అభ్యర్థి జాడి రాజయ్య విజయం సాధించాడు. బాసరలో 6వ వార్డుకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మద్దతు అభ్యర్థిని రాజేశ్వరి దేశ్‌ముఖ్ విజయం సాధించగా, దండేపల్లి మండలం తాళ్ళపల్లి వార్డుకు టీఆర్‌ఎస్‌కు చెందిన సుజాత విజయం సాధించారు. వేమనపల్లి మండలం లింగాలలో టీఆర్‌ఎస్ తిరుగుబాటు అభ్యర్థిని చౌదరి పద్మ విజయం సాధించారు. జిల్లాలో సర్పంచ్ స్థానాన్ని బిజెపి కైవసం చేసుకోగా ఒక వార్డును కాంగ్రెస్, మిగితా రెండు వార్డుల్లో టీఆర్‌ఎస్ తిరుగుబాటు అభ్యర్థులు, మరో రెండు వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు.