Others

అదే జోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తున్న నేహా శర్మ చెల్లెలు ఆయేషా శర్మ ఒక్కసారిగా షూటింగ్ వదిలేసి వెళ్లిపోయిందని పుకార్లు వచ్చాయి. అది నిజమో కాదో తెలుసుకునేలోపే ఆయేషా శర్మ ముంబయిలో వున్నట్లుగా సమాచారం అందింది. ఇంతకూ షూటింగ్ వదిలిపెట్టి అక్కడకు ఎందుకు వెళ్లింది అంటే, నూతన సంవత్సరం సందర్భంగా కింగ్‌ఫిషర్ క్యాలెండర్‌కు ఫొటోషూట్ చేయడానికి వెళ్లిందట. గతంలో దీపికా పదుకొనె, కత్రినాకైఫ్‌లాంటివాళ్లు ఈ కాలెండర్లకు బికినీలలో ఫోజులిచ్చినవాళ్లే. అందాలు ఆరబోసినవాళ్లే. అందుకే ఇప్పుడు తాను కూడా కాలెండర్‌లో కనపడితే, అనవసరంగా తెలుగు సినిమాల్లో ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత బాలీవుడ్‌కి ప్రయాణించాల్సిన అవసరం వుండదు కదా అని ఆలోచించిందో ఏమో! ఒక్కసారిగా గ్రీన్‌కార్డు తీసుకున్నట్లుగా బొంబాయి చెక్కేసి కేలండర్‌కు ఫోజులిచ్చే పనిలో పడింది ఆయేషా శర్మ. చూద్దాం ఆమె ఆశ ఎంతవరకూ నెరవేరుతుందో! (చిత్రం) ఆయేషా శర్మ