జాతీయ వార్తలు

అధికారం లేదనే అక్కసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటును అడ్డుకుంటారా? కాంగ్రెస్ ధోరణిపై మోదీ నిప్పులు

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: దేశ ప్రజలు తిరస్కరించిన వారు పార్లమెంటు సమావేశాలను స్తంభింపచేస్తూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీస్తున్నారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అభివృద్ధి సాధన కోసం పార్లమెంటు సమావేశాలను సజావుగా సాగనిస్తామనే కొత్త సంవత్సరం తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. నరేంద్ర మోదీ గురువారం 14 లేన్ల ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి శంకు స్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విరుచుకు పడ్డారు. ‘పార్లమెంటులో మాట్లాడే అవకాశం లభించలేదు కాబట్టి ఇప్పుడు లభించిన అవకాశాన్ని వాడుకుంటున్నాను. బహిరంగ సభలో ప్రజల ముందు నా అభిప్రాయాలను వెల్లడిస్తున్నాను’అని మోదీ స్పష్టం చేశారు. అరవై సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించిన రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటు సమావేశాలను అడ్డుకునే హక్కు, అధికారం కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం లేదని ఆయన హెచ్చరించారు. దేశాభివృద్ధిని కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటోందని ఆయన దుయ్యబట్టారు.‘నేడు జనవరి ఒకటో తేదీ. నూతన సంవత్సరాన్ని జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంలో పార్లమెంటు సమావేశాలకు అడ్డుతగలకుండా సజావుగా నడవనిస్తాం. దేశాభివృద్ధిని ఇక మీదట అడ్డుకోవటం జరగదని కాంగ్రెస్ పార్టీ ప్రతిజ్ఞ చేయాలి’అని ఆయన సూచించారు. పార్లమెంటును కొనసాగనివ్వకపోవటం నిజంగా దురదృష్టమని మోదీ వ్యాఖ్యానించారు. ‘శాసనాలు చేసే పార్లమెంటును పని చేయనివ్వటం లేదు. ప్రజలు తిరస్కరించిన వారు పార్లమెంటుకు అడుగడుగునా అడ్డుతగులుతున్నారు’అని మోదీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటును పని చేయనివ్వటం లేదు, ఇలా చేయకూడదని రాజకీయ పార్టీలను కోరుతున్నానని ప్రధాన మంత్రి చెప్పారు. పార్లమెంటులో చర్చించి, తర్కించి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రజలను తమను అక్కడిక పంపించారని మోదీ తెలిపారు. పార్లమెంటు సజావుగా జరిగేలా చూడవలసిన గురుతర బాధ్యత దాదాపుఆరు దశాబ్దాల పాటు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీపై ఎక్కువ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. చర్చించి, సమాలోచనలు జరిపి నిర్ణయం తీసుకునేందుకే ప్రజలు తమను ఎన్నుకున్నారనేది అన్ని రాజకీయ పార్టీలు గ్రహించాలని నరేంద్రమోదీ సూచించారు. దేశంలోని బీద, బడుగు ప్రజల అభివృద్ధి కోసం పార్లమెంటును సజావుగా నడవనిస్తామని అన్ని రాజకీయ పార్టీలు కొత్త సంవత్సరం తీర్మానం చేసుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. ప్రజలు మనకు ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించటం విధి అనే సంగతి రాజకీయ పార్టీలు మరువకూడదని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటును స్తంభింపజేయటం ఎంత మాత్రం మంచిది కాదనేది ఇప్పటికైనా గ్రహించాలని కాంగ్రెస్ పార్టీకి సూచించారు. దేశాన్ని పాలించే అధికారం లభించని వారికి ఆగ్రహం ఉంటే ఉండొచ్చుగాని, దాదాపు ఆరు దశాబ్దాల పాటు అధికారం చెలాయించిన కాంగ్రెస్‌కు పార్లమెంటరీ వ్యవస్థను అపహాస్యం చేసే తీరులో వ్యవహరించడం సమర్ధనీయం కాదని, వారికి ఆ హక్కులేదని మోదీ విరుచుకుపడ్డారు.