జాతీయ వార్తలు

ఆదిల్ చదువుమధ్యలో ఆపేశాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూల్వామా: పూల్వామాలో నలభై మంది జవాన్ల మృతికి కారకుడైన ఆదిల్ అహ్మద్ దర్ స్కూలు మధ్యలోనే తన చదువు ఆపేశాడు. ఈ ఉగ్రవాది గురించి మీడింయా వివరాలు సేకరించగా కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. మూడేళ్ల క్రితం స్కూలు నుంచి వచ్చిన తన కుమారుడ్ని పోలీసులపై రాళ్లు రువ్వాడనే ఆరోపణలపై పోలీసులు తీవ్రంగా కొట్టారని, ముక్కు నేలపై రాయించారని, దీనిని అవమానంగా భావించాడని తల్లిదండ్రులు చెప్పారు. ఆ తరువాత చదువుకోనంటూ స్కూలుకు వెళ్లలేదని, 20 సంవత్సరాల వయసులో ఉగ్రవాదిగా మారాడని, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరాడని, తాము ఉగ్రవాద కార్యకలాపాలను మానుకోమని ఎన్నోసార్లు చెప్పామని తండ్రి గులామ్ తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడని తెలుసుగానీ జవాన్లను చంపుతాడని తాము ఊహించలేదని తల్లిదండ్రులు తెలిపారు. జవాన్లపై దాడికి పదిరోజుల ముందు పూల్వామాలో ఇళ్లు అద్దెకు తీసుకున్నాడు. 40 మంది జవాన్ల కాన్వాయ్ వస్తుందని తెలుసుకుని ఆర్డీఎక్స్ మందుపాతర పదార్థాలను కారులో తీసుకుని వెళ్లి కారుతో వేగంగా వెళ్లి కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టాడు. ఆ తరువాత ఇతడికి సంబంధించిన వీడియోను జైషే మహ్మద్ సంస్థ విడుదల చేసింది. ఈ వీడియో మీకు చేరేసరికి తాను స్వర్గంలో ఉంటానని ఆదోల్ ఆ వీడియో సందేశంలో తెలిపాడు. జవాన్లను చంపటం తప్పుకాదని తనని తాను సమర్థించుకున్నాడు.