ఆదిత్యకు చైనా అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో భారతదేశంనుండి పాల్గొన్న ఆదిత్య చిత్రానికి అవార్డు లభించింది. చైనా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికై ఉత్తమ బాలల చిత్రంగా అవార్డు అందుకున్న ఆదిత్య (క్రియేటివ్ జీనియస్) చిత్రాన్ని సంతోష్ ఫిలింస్ పతాకంపై భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో మన దేశం తరఫున కెనడా, అమెరికా, టోరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు పంపించామని, తెలుగు రాష్ట్రాల తరఫున పాల్గొన్న ఏకైక చిత్రం ఇదేనని ఆయన తెలిపారు. మన రాష్ట్రంలో ఈ చిత్రానికి వినోదం పన్ను వందశాతం రాయితీ లభించిందని, వివిధ జిల్లాలలో స్కూల్ విద్యార్థులకు నూన్ షోగా ప్రదర్శిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ అవార్డును షాంఘైలో ప్రదానం చేశారని ఆయన వివరించారు.