AADIVAVRAM - Others

ఉత్తర వాయవ్య దోషం (వాస్తు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుమార్ (చిన్నతిరుపతి)
ప్రశ్న: ఎంత ప్రయత్నించినా మంచి ఉద్యోగం సంపాదించలేక పోతున్నాను.
జ: మీ ఇంటికి సంబంధించి ఉత్తర వాయవ్య దోషం ఉంది. ముందుగా ఆ దోష నివారణ చేసుకోండి. వాయవ్యంలోగల సెప్టిక్ ట్యాంకును అక్కడ నుండి తీసివేసి ఉత్తర మధ్యభాగంలోకి మార్చుకోండి. మంచి ఉద్యోగం వస్తుంది.
రామస్వామి (దెందులూరు)
ప్రశ్న: మేం స్థలంగానీ/ ఇల్లు గానీ కొనుగోలు చేయాలనుకుంటున్నాము. మా పేరు ప్రకారం ఏ దిశ యోగిస్తుంది?
జ: మీ పేరు రీత్యా ఉత్తరం రోడ్డు కలిగిన ఉత్తర దిశ చాలా బాగా యోగిస్తుంది. ముఖ్యమైన విషయం - కట్టే ఇల్లు వాస్తు ప్రకారం ఉన్నప్పుడు మాత్రమే ఉత్తర దిశ వలన కలిగే మంచి ఫలితాలను పొందగలరు.
గాయత్రీదేవి (గూడెం)
ప్రశ్న: మేం ఏ పని తలపెట్టినా ముందుకు వెళ్లడం లేదు. మా మీద అయిన వాళ్ల పెత్తనం ఎక్కువగా ఉంటోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నది? పరిష్కారం తెలుపగలరు.
జ: మీ ఇంటికి సంబంధించి ఉత్తర వాయవ్య దోషం ఉన్నది. ఆ దోష నివారణ చేసుకున్నట్లయితే మీరు అనుకున్న పనులు జరుగుతాయి. అలాగే నైరుతి దోషం కూడా మీ ఇంటికి ఉండటం వల్ల అయిన వాళ్ల పెత్తనం ఎక్కువగా వున్నది. నైరుతి దోష నివారణ కూడా చేసుకోండి. మీ సమస్యలు తీరుతాయి.
భాస్కర్ (దోరసానిపాడు)
ప్రశ్న: దక్షిణ ముఖద్వారం గల ఇంటికి ఆగ్నేయంలో వంట గది ఎలా సాధ్యం? వేరే చోట వంటగదిని ఏర్పాటు చేసుకోవచ్చా?
జ: దక్షిణ రోడ్డు ఉండి దక్షిణ ఆగ్నేయంలో ముఖద్వారం వున్నప్పుడు, వాయవ్య మూలలో మాత్రమే వంటగదిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ దక్షిణ ముఖద్వారం ఇళ్లకు మాత్రమే వాయవ్యంలో వంటగది ఉండాలి. అలా కాకుండా ఇంక ఎక్కడైనా వంటగది ఉన్నట్లయితే దానివల్ల వచ్చే చెడు ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది.
*

-వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ -96 42 70 61 28