AADIVAVRAM - Others

పారిక్యూటిన్ వోల్కనో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక పచ్చటి ఉదయం.. విరగపండిన మొక్కజొన్న చేలు.. పక్షుల కిలకిలా రావాలు.. చల్లగాలుల్లో తలలూపుతున్న పైరు మొక్కలు.. అదీ ఆ గ్రామ పొలిమేరల్లో కనిపించిన దృశ్యం. మరుసటి రోజే అక్కడంతా పొగలు. ఎగిసిపడుతున్న మంటలు.. ఉండుండి పెద్దపెద్ద పేలుళ్లు. గ్రామస్థులెంతగా దిగ్భ్రాంతి చెంది ఉంటారో ఆలోచించండి. 1943 ఫిబ్రవరి 20న రైతులు ఎప్పటిలాగే పొద్దుటే వచ్చి పొలాల్లో పనులు చేసుకుంటున్నారు. అంతలో ఉన్నట్లుండి భారీ భూకంపం. ఏదో పెను విపత్తు వస్తోందని తెలిసిపోయింది. దేవుడిని ప్రార్థిస్తూ శక్తికొద్దీ రైతులంతా పరుగుతీశారు. ఆ తర్వాత రోజు అక్కడ ఇంకేం లేదు. పొలాలు అదృశ్యమయ్యాయి. ‘పొలాల స్థానంలో బూడిద కుప్పలు మీటర్ల ఎత్తున పేరుకుపోయాయి. ఒక ఏడాది గడిచేసరికి అగ్నిపర్వతం గ్రామాన్ని కూడా కబళించిందని ఇసాక్ అసిమోవ్ ఈ సంఘటనను గ్రంథస్థం చేశారు. అదృష్టం ఏమిటంటే ఇదంతా మెల్లమెల్లగా జరిగింది. ప్రాణనష్టం అసల్లేదు. అగ్నిపర్వతం తొమ్మిదేళ్లపాటు పేలిపోతూనే ఉంది. ఆ ఒక్క ఊరే కాదు. సమీపంలో ఇతర ప్రాంతాలూ ధ్వంసమయ్యాయి. 1952లో పారిక్యూటిన్ ఓల్కనో శాంతించింది. దీని ప్రత్యేకతల్లా ఓ అగ్నిపర్వతం ఎలా ప్రజ్వరిల్లుతుందీ.. ఇవన్నీ ప్రత్యక్షంగా తీరిగ్గా పరిశీలించడానికి భూగర్భ పరిశోధకులకు అమూల్యమైన అవకాశం కల్పించింది. దీన్ని ప్రకృతి వింతల్లో చేర్చడానికి ఇది ప్రత్యేకమైన కారణమని ‘లైఫ్’ మేగజైన్ సంపాదకవర్గం వివరణ ఇచ్చింది.

-బి.మాన్‌సింగ్ నాయక్