మనలో - మనం

మనలో-మనం ( ఎడిటర్‌తో ముఖాముఖి )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు, ప్రకాశం జిల్లా
‘వెనె్నల’ శీర్షిక శుక్రవారం నుండి మంగళవారం మార్పు నాకు అసంతృప్తిగా ఉంది. ఈ మార్పునకు కారణం?
శుక్రవారం విడుదలయ్యే కొత్త సినిమాల సమీక్షలు ఇంకో వారం దాకా ఆగకుండా త్వరగా ఇవ్వొచ్చని.

ఈశ్వర్, ముక్కామల
ఏ కారణం చేత, ఎవరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా, దానిని పత్రికలూ, కాలువలూ (్ఛనెల్స్) పట్టించుకోకపోతే ఎలాగుంటుంది?
కనీసం 8 గంటల ఆమరణ దీక్షలను పట్టించుకోకుంటే మేలు.

గుండు రమణయ్య, పెద్దాపూర్, కరీంనగర్
‘ముద్రగడ’ ఆమరణ దీక్షలోని ఆంతర్యం?
బహుశా ఆయనకూ తెలిసి ఉండదు.

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తేంటి?
జండా ఎత్తెయ్యవచ్చు.

కురువ శ్రీనివాసులు, హైదరాబాద్
కారు స్పీడుకు విపక్షాలు కొట్టుకుపోయాయి మేయర్ ఎన్నికల్లో! ఇందులో మర్మమేంటి మహాశయా?
విపక్షాల చేతకానితనం

కొలుసు శోభనాచలం, గరికపర్రు, కృష్ణాజిల్లా
ముద్రగడ కాపులను బి.సిలో చేర్చాలని ఆమరణ నిరాహారదీక్షకు పూనుకొనుట, అనూహ్య రీతిలో విరమించుట వలన సాధించింది ఏమిటో వివరించగలరు?
సున్న.

ఈ ఉద్యమంలో జరిగిన నష్టానికి ఉద్యమ నాయకులు బాధ్యులే గదా? ఆ నష్టాన్ని ఈ నాయకుల నుండి వసూలు చేయకూడదా?
చేయగలిగితే బాగానే ఉంటుంది.

బొడ్డపాటి రాజేశ్వరమూర్తి, చిలకలపూడి, బందరు
నేను 1956లో ‘ఆంధ్రపత్రిక’ వారపత్రికకు గేయం పంపితే, అచ్చయి నాకు రూ.5/-లు మనీ ఆర్డరు పంపారు. ఈనాడు వీక్లీలు - మంత్లీలు, ఛారిటబుల్ సంస్థలు కలిసి ఒక సీరియల్‌కు రూ.50,000/-లు, ఎన్నికైన కథకు రూ.5,000/- ఇస్తున్నారు. నేడు సాహిత్యంలో ‘బరువు’ పెరిగిందా?
పరువు తగ్గింది.

యల్లాప్రగడ మల్లన్న, గుల్లలపాలెం, విశాఖ
గుడికి గంట, పంతులుగారు, శ్లోకాలు, అర్చన, పూజాదికాలు తప్పవు. మంత్రోచ్ఛారణలు ఆ నాలుగు గోడలకి వినిపిస్తే చాలును కదా? మైక్‌లో బాకా ఊది మైలు దూరం వరకూ డిస్టర్బ్ చెయ్యాలా? ఆ స్వరం వుంటే కాని భగవంతునికి వినిపించదా? ఈ ఆర్భాటం పిచ్చి వదిలేది ఎలా?
ఈ మాట మీ దగ్గర్లోని మసీదు, చర్చిల వారికి కూడా చెప్పి చూడండి.

తాళాబత్తుల సత్యనారాయణ మూర్తి, మల్కాపురం, విశాఖ
అ.ని.శా వారికి ఆర్‌టివో స్ట్ఫా, సబ్ రిజిస్ట్రార్లే ఎప్పుడూ కనిపిస్తారా? కస్టమ్స్ (మెట్రోల్లో) మున్సిపల్ బడాబాబులు ఆనరా? పేద్ద ఇళ్లు, భారీ ఫ్లాట్లున్న ప్రభుత్వోద్యోగుల ఇళ్లల్లో స్విమ్మింగ్ పూల్స్ వీరిక్కనిపించవా?
ఫిర్యాదు అందితే వాళ్లకూ వలలేస్తారు.

సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ
హైదరాబాదు అభివృద్ధి మేమే చేశామన్నారు రాష్ట్రంలో ప్రస్తుత పాలకవర్గం. ముందు మేము చేశాము కదా అన్నారు పాత పాలకవర్గం. హైదరాబాదు తెలంగాణకే ఇప్పించాము అన్నారు కేంద్ర పాలక వర్గం. హైదరాబాదు కోసం పాటుపడిన 3 పార్టీలకు గ్రేటర్ ఎన్నికల్లో నీడ లేకుండా టిఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు కదా? ఇందులో ఆంతర్యమేమిటి సార్?
నమ్మదగిన వాళ్లు, దమ్మున్నవాళ్లు ఇంకెవరూ కనిపించక.

నల్లపాటి సురేంద్ర, కొత్తగాజువాక, విశాఖ
ఒక ఛానెల్ వారు ‘ప్రజల కోసం బాగా ఆలోచించేది పవన్ కళ్యాణా లేదా జగనా? అనే ఎస్సెమ్మెస్‌లో పవన్‌గారికి తొంభై శాతం వచ్చింది. అదెలా సాధ్యం? ఎప్పుడూ నెట్‌లో తప్ప ప్రజల వద్దకు పవన్ రాలేదు కదా?
లోగుట్టు చానెళ్లకెరుక.

ఇద్దరు చంద్రులు, రాష్ట్రాలను పరిపాలిస్తున్నారు. ఒక చంద్రుడికి ఆనందాలకు ఆనందం తోడైతే మరో చంద్రుడికి కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి. ఇలా ఎంతకాలం?
గ్రహణాల పండితులు చెప్పాలి.

బి.మోహనకుమారి, చెన్నయ్
ఎంతెంత జీతాలు వస్తున్నా - పత్రికల నుండి పాతిక రూపాయలు ఎం.ఓ. వస్తే - ఆ ఫారం జేబులో పెట్టుకుని గర్వంగా తిరుగుతాడు పాఠకుడు. అలాంటి చిన్న చిన్న ఆనందాలు (గొప్పగా ఉంటాయి) మీరూ కలిగించండి.
చూద్దాం.

డా.కొమ్మన శ్రీనివాసకుమార్, నెల్లూరు
శనివారం భూమికలో వేసే కథను - సోమవారం వచ్చే సాహితిలో ప్రచురిస్తే బాగుంటుందేమో?
బాగుండదు

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
ఎ.పి. దేవాదాయ మంత్రిగారు శ్రీశైలంలో ఆయుర్వేద వైద్య కేంద్రాన్ని ఏర్పాటుచేసి కేరళ వైద్యులచే ఇక్కడ వైద్యసేవ లందిస్తామని, రామ్‌దేవ్ బాబాగారి మందులు తెప్పిస్తామని చెప్పారు. ఎ.పి. (లేదా తెలంగాణ)లో ఘన వైద్యులు లేరా? తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి పొందిన వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం, చింతలూరు వారి మందులు పనికిరావా?
అలాంటివి ఉన్నా ఇప్పటికీ తెలుగువాళ్లు చాలామంది వైద్యానికి కేరళ వెళుతున్నారు గదా? మంత్రి మాటల ఉద్దేశం వేరు.

ఎం.కనకదుర్గ, తెనాలి
మహిళల సంక్షేమానికి ఎన్ని చట్టాలు చేసినా సమాజంలో కొనసాగుతున్న లింగ వివక్ష వలన అవన్నీ చట్టుబండలు అవుతున్నాయని ఇటీవల తమిళనాడులో అర్చనా రామసుందరం అధికారిణి ఉదంతం స్పష్టం చేస్తోంది. రాకెట్ యుగంలో వున్నామని చెప్పుకుంటున్నా ఇంకా ఇలాంటి మూర్ఖత్వం, కాలం చెల్లిన ఆలోచనా విధానం సమాజంలో పరిఢవిల్లడం బాధాకరం కదా?
ఔను. *

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : bhoomisunday@deccanmail.com