అక్షరాలోచన

పయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా గుండెల్లో ఎవరో కాగడాను పెట్టి తిప్పినట్లు
నే బతికుండగానే నా తలకు కొరివి పెడుతున్నట్టు
నా అవయవాలన్నిటినీ చప్పుడు కాకుండా కొరికి తింటున్నట్టు
నా శరీరంలోని రక్తమంతా బయటకు వచ్చి అట్టలు కట్టినట్లు
ఎవరో నన్ను అధః పాతాళానికి తొక్కేస్తున్నట్లు
తెలియని వెలితేదో నా హృదయాన్ని కప్పేస్తుంది
ఆకాశాన్ని కురవని మేఘం కప్పేసినట్లు
సగం కాలిన కవురుకంపు
నా అణువణువు మెలి తిప్పి నన్ను గాల్లో విసిరేసినట్లు
నా మనసు సుడిగుండంలో గడ్డి పరకలా తిరుగుతుంది
ఈ భూమిని మట్టి పొరలు కప్పినట్టు
నా కన్నీరు నా చూపునే కప్పేస్తుంది
కపటం తెలియని పక్షి కల్లోలంలో ఎగిరి ఎటెటో తిరిగినట్టు
నా మనసు అల్లాడిపోతుంది
ఎల్లలు తెలియని గాలి అన్ని దిక్కులూ తిరిగినట్టు
నా ఆలోచనల పరదాలు అటో ఇటో ఎటో
వెళ్లాయి, మరల తిరిగి రానంటున్నాయి
జీవం నుండి మరణానికి బలవంతంగా తోసేసినట్లు
వెలిగే చితిపై నీళ్లు చిలకరించినా
కాలుతున్న శవానికి జీవం రాదని తెలుసు
అయినా.. దింపుడు కళ్లెం ఆశ చావట్లేదు
స్మశానంలో వెలిగే కట్టె ఇంటికి దీపం కాదని తెలిసినా,
దారైనా చూపదా? అన్న ఆశ మిగిలి
నన్ను మరలా మరలా ఆలోచింపజేస్తూ
నా ఆశకు జీవాన్నిస్తుంది
అందుకే
కట్టెను కాగడాగా మార్చుకుని
ఆశనే ఆయువుగా మలచి
చీకటి నుండి వెలుగుకి
చితి నుండి జీవానికి
పయనవౌతా
నా ఉనికి ఈ లోకానికి ఎలుగెత్తి చాటుతా.

-అమర్లపూడి కళ్యాణ్‌కుమార్ 8341136796