ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? ( సెప్టెంబర్ 4 నుండి 10 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆత్మబలంతో నిర్విఘ్నంగా కార్యాలు పూర్తి చేస్తారు. అనుకోని సంఘటనలు తెర మీదకి రానున్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలు, స్థల మార్పులున్నాయి. వ్యాపార, విద్య, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. పైకం, లావాదేవీలందు జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక, సంఘ కార్యక్రమాలు మీ కనుసన్నలతో మెరుగవుతాయి. స్ర్తిలకు ఉద్యోగప్రాప్తి. శుభకార్యాలు అనుకూలిస్తాయి. వాహన ప్రయాణాలందు అప్రమత్తత అవసరం. ఆలోచనలు అన్నింటా మేలు. స్పెక్యులేషన్ సంతృప్తికరం. ఒక ముఖ్య సమాచారం సంతోషాన్నిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

తడబాటు లేకుండా స్వశక్తితో యత్న కార్యసిద్ధి. దైనందిక, వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు మెరుగైన ఫలితాల నిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి సమావేశాలు, సంఘ కార్యక్రమాలందు పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. పోటీ పరీక్షలలో పాల్గొన్న వారికి ఆలస్యంగానైనా ఫలితాలు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు ఖరీదు చేస్తారు. స్ర్తి పురుషులు ముఖ్యమైన పనులందు అన్యోన్యతతో మెలగుతారు. బంధువుల రాక. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ప్రయాణాలందు అప్రమత్తత అవసరం. అనవసర జోక్యాలు వద్దు. స్పెక్యులేషన్ ఫరవాలేదు.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

పనులు పూర్తవుతాయి. ఆదాయ వ్యయాలు ఆలోచింపజేస్తాయి. అనుకున్న పనులు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపార, వ్యవసాయ, భాగస్వామ్య వ్యవహారాలందు అప్రమత్తంగా ఉండాలి. వేరేచోట వ్యాపార విస్తరణలకు అవకాశముంది. వృత్తి, ఉద్యోగ, సాంకేతిక రంగాల వారు అనుకున్న ఫలితాలు మెల్లగానైనా అందుకుంటారు. అనాలోచితంగా ప్రయాణాలు వద్దు. నీటి దగ్గర, కార్యాలయ ప్రాంతంలో పరిసరాలకు అనుగుణంగా ఉండాలి. ముఖ్యమైన కార్యాలందు బంధుమిత్రులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. గౌరవ మన్ననలను అందుకుంటారు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

కోపంతో ఏ పనులూ పూర్తి చేయవద్దు. విఘ్నాలున్నా నిర్విఘ్నంగా మిత్రులు, హితుల సాయంతో పూర్తవుతాయి. విలువైన వస్తువులతో ప్రయాణాలందు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి ఔషధ సేవనం తప్పదు. పెద్దల పరిచయాల వల్ల ప్రయోజనాలున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార, వినోద రంగాల వారు మంచి ఫలితాలందుకుంటారు. ఆధ్యాత్మిక, యాత్రా కార్యకలాపాలు విస్తరిస్తాయి. లావాదేవీల గురించి ఇతరులకు చెప్పకండి. పనులందు స్వీయ పర్యవేక్షణ మేలు. ప్రయాణాలు చేస్తారు. అనుకోని లాభాలు, సేవలు విస్తరిస్తాయి. స్పెక్యులేషన్ తృప్తికరం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

పనులు పూర్తి చేస్తారు. ఆదాయ లావాదేవీలు తృప్తినిస్తాయి. ఉద్యోగులకు స్థల మార్పిడులు. లాభదాయకమైన, న్యాయపరమైన వ్యవహారాలందు పాల్గొంటారు. శుభ పరిణామాలున్నాయి. విద్య, వృత్తి, ఉద్యోగ రంగాల వారికి అనుకున్నట్లుగా కాక, మలుపులు తిరిగే అవకాశాలున్నాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిరు వ్యాపారులు అనుకోని శుభ పరిణామా లందుకుంటారు. ధన వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. శక్తిని పరిగణనలోకి తీసుకుని పనులు పూర్తి చేయండి. ఆభరణాలతో ప్రయాణాలందు జాగ్రత్త వహించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

నేర్పే తీర్పు. సమయానికి తగ్గట్లు పనులు పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందులున్నా సమయానికి ధనం అందుతుంది. రాజకీయ, వ్యాపార, కళ, రియల్ ఎస్టేట్, వృత్తి, ఈవెంట్ మేనేజ్‌మెంట్ వారు మెరుగైన ఫలితాలందుకుంటారు. ఆదాయం వున్నప్పటికీ అనుకోని ఖర్చులు, మిత్రులకు పైకం ఇవ్వవలసి రావచ్చు. ఆలోచించి ఏ విషయంలోనైనా శక్తికి మించి ప్రవర్తించకండి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. ప్రైవేటు ఉద్యగులకు స్థిరీకరణకు అవకాశం. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. సంతోషాన్ని పొందుతారు.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
అనుకున్న పనులు సిద్ధిస్తాయి. శ్రమపై అనుకోని కార్యాలు అనుకూలిస్తాయి. ఆదాయ వ్యయాలపై సమీక్ష అవసరం. సంఘ కార్యాలందు, మిత్రులతో ప్రయాణాలున్నాయి. వృత్తి, వ్యాపారాల విస్తరణకు అవకాశముంది. విద్య, పోటీ పరీక్షలు, నిరుద్యోగులకు గత వారంకన్నా మెరుగైన ఫలితాలుంటాయి. స్ర్తి పురుషుల ప్రయత్నాలు మెరుగవుతాయి. బంధుమిత్రుల ఆరోగ్య విషయాలపై పరామర్శలకు వెళ్లవలసి వస్తుంది. ఆందోళనలకు గురికావద్దు. మీ హద్దుల్లో ఉంటే మంచిది.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
సంకల్ప బలంతో అందిన వనరులతో కార్యాలు పూర్తి చేస్తారు. వ్యవసాయ, వృత్తి, వ్యాపార, చేనేత, సాంకేతిక, ఆటోమొబైల్స్ రంగాల వారికి అనుకూలం. ప్రయాణాలందు అప్రమత్తంగా ఉండాలి. అన్నింటా ఓర్పు మార్పులతో మేలైన ఫలితాలందుకుంటారు. వదంతులు నమ్మవద్దు. స్వీయశక్తిపై ఆధారపడండి. ఆంతరంగిక వ్యవహారాలు ఎవరికీ తెలియనీయకండి. పెద్దల మన్ననలు, ఆశీస్సులు అందుకుంటారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. స్వీయ నియంత్రణ అవసరమని తెలుసుకోండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

అనవసర బరువు బాధ్యతలు మీద వేసుకోవద్దు. ధనాదాయం ఖర్చుకన్నా కొంచెం అధికమవుతుంది. దంపతులకు గతకాలంకన్నా బాగుంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. సంతాన విషయంలో మీరు ఊహించినట్లుగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, మిఠాయి దుకాణాలు, పూజా సామాగ్రి, స్టేషనరీ వ్యాపారాలు మెరుగవుతాయి. మీ మాట సాయానికై మిత్రులు ఎదురుచూస్తుంటారు. సంఘ కార్యక్రమాలందు మిత్రులతో కలిసి పాల్గొంటారు. అనుకోని పైకం అందనుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

చాకచక్యంగా పనులు పూర్తి చేస్తారు. ధనాదాయం, వ్యయం పోటీ పడతాయి. పట్టువిడుపులతో పనులందు నియంత్రణ ఉండాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వైద్య, సాంకేతిక, రియల్ ఎస్టేట్ రంగాల వారు అనుకున్నవి సాధిస్తారు. సంఘ కార్యాలందు బంధుమిత్రులతో కలిసి గౌరవ మర్యాద లందుకుంటారు. దంపతులు వైవిధ్యమైన విషయ సేకరణందు నిమగ్నమవుతారు. బదిలీలు, స్థల మార్పులు ఉన్నాయి. అరమరికలు లేకుండా ముందుకు వెళ్లడం మేలు. కోర్టు విషయాలు అనుకూలిస్తాయి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చు ఎలా అవుతుందో పరిశీలించుకోవాలి. స్ర్తి పురుషులు అభద్రతా భావాన్ని విడనాడండి. ట్రావెల్, ఆటోమొబైల్స్, చిత్రకారులు, పత్రికా రంగాల వారు అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది వృత్తిపరంగా. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, కళ, న్యాయ రంగాల వారు మెరుగైన ఫలితాలందుకుంటారు. మాటకు విలువ పెరిగి హితులకు ఉపయోగపడుతుంది. భయాందోళనలు దరికి రానీయకండి. ఓ వార్త సంతోషాన్నిస్తుంది. శుభ వర్తమానాలున్నాయి. ప్రణాళిక అంచనాలు మెరుగవుతాయి. రాబడికన్నా పోబడి ఎక్కువ ఉండవచ్చు.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆనందాన్ని బంధుమిత్రులతో పంచుకుంటారు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. దైవ, ఆధ్యాత్మిక కార్యాలందు మీదైన పద్ధతిలో పాల్గొంటారు. అన్ని రంగాల వారు నిబద్ధతతో కృషిచేస్తేనే మంచి ఫలితాలను అందుకుంటారు. పోటీ పరీక్షలందు అనుకూల వాతావరణముంటుంది. ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. సంశయాలు విడనాడాలి. స్ర్తి పురుషులు అనుకున్నవి సాధిస్తారు. పెట్టుబడితోనే స్పెక్యులేషన్ మెరుగవుతుంది.

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855