హైదరాబాద్

సర్దుబాటు పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: సార్వత్రిక ఎన్నికల్లో మిత్రులుగా పోటీ చేసిన టిడిపి, బిజెపి పార్టీల అధినాయకులు సీట్ల సర్దుబాటు కోసం పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో రెండు రెండు పార్టీలకు చెందిన ఎంతెంత మంది అభ్యర్థులను రంగంలో దింపాలి? ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ పట్టుంది? అందులో ఎన్ని డివిజన్లు ఏ పార్టీకి కేటాయించాలన్న విషయంపై ఉభయపార్టీలకు చెందిన నేతలు ప్రాథమికంగా కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. గతంలో 2001లో అప్పటి నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో కలిసి పొటీ చేసి వీలైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకున్న మిత్రులు ఈసారి కూడా గ్రేటర్ ఎన్నికల్లో ఆ పాత దోస్తీ కలిసొస్తుందని భావిస్తున్నట్లు సమాచారం. కానీ అప్పట్లో రెండు పార్టీల సీట్ల సర్దుబాటు విషయమై పలు డివిజన్ల నుంచి సీట్లు ఆశించిన కొందరు సీనియర్ నేతలకు సీట్లు దక్కకపోవటంతో వారు తీవ్ర అసంతృప్తికి గురైన సంగతి తెలిసిందే! ఆ రకంగా అసంతృప్తికి గురైన నేతల్లో కొందరు అప్పట్లో ఇతర పార్టీలో కూడా చేరారు. ఈ క్రమంలో ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన నేతలకు అధికార తెరాస పార్టీ ఆకర్ష్ స్కీంతో గాలం వేస్తున్న తరుణంలో సీట్ల సర్దుబాటు విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించాలని రెండు పార్టీలకు చెందిన నేతలు భావిస్తున్నారు. కానీ ఇప్పటికే నగరంలోని పలు డివిజన్లలో టికెట్ల కోసం ఆశలు పెట్టుకుని, ప్రజల్లోకి వెళ్తున్న నేతల్లో కొందరు ఈసారి టికెటు దక్కకుంటే వేరే పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ అధినాయకులకు ఇలాంటి బెడద ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల కొంత వరకుండగా, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న సికిందరాబాద్, సనత్‌నగర్ నియోజవకర్గాల్లో మరింత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఎక్కువ సీట్లను గెల్చుకునేందుకు ఎలాగూ మంత్రులు రంగంలో దిగుతుండటంతో చాలాకాలంగా డివిజన్‌లోనే ఉంటూ, ప్రజల మధ్య ఉన్న సీనియర్ నేతలకు టికెట్లు కేటాయించాలని ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు భావిస్తున్నారు. తమకు సీట్లు కేటాయించకుంటే ఇతర ఏ పార్టీ టికెటు ఇచ్చినా, పోటీ చేసి తీరుతామని పలువురు ఆశావహులు తేల్చి చెబుతున్నారు. స్థానిక సమస్యలపై అవగాహన, అంతో ఇంతో ఆర్థిక స్తోమత ఉన్న నేతల కోసం సైతం ఎదురుచూస్తున్న పార్టీలు సైతం లేకపోలేవు. ఒకవైపు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు చేజిక్కించుకోవాలన్న లక్ష్యం, మరోవైపు పార్టీ నేతలను సైతం సంతృప్తిపరిచేందుకు టిడిపి, బిజెపి పార్టీలు ఏ రకంగా ముందుకెళ్తాయో వేచి చూడాలి!