అక్షరాలోచన

అనుకోని అతిథి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతనికి ఆహ్వానాలతో పనిలేదు
స్వాగత ద్వారాలు చాలు
తెచ్చుకోలు చిరునవ్వులు నచ్చవు
ఫొటోల కోసం వాటేసుకోడు
కెమెరా కంట్లో పడాలని
ముందు వరసలో సీటేసుకోడు
సహృదయంతో ఆశీర్వదిస్తాడు
సంతోషంగా భోంచేసి వెళ్తాడు
బంధుమిత్రుల జాబితాలో లేడు
వధూవరుల్లో ఎవరివాడో తెలియదు
ఎవడు వాడు ఎచటి వాడని
ఆరాలు తీయడం అనవసరం
అతనో రోడ్డున పడ్డ జోగి
పూట గడవని నిరుద్యోగి
చతికిలపడ్డ సంసారి
తన విషాదాల కవనాన్ని కప్పిపెట్టి
ఇతరుల ఆనందాల షాయరీ వినేవాడు
ఫోన్ చేసినా ఎత్తనివాళ్ళు
నమస్తే అన్నా వినిపించుకోనివాళ్ళు
వచ్చినా విఐపీల్లా కనబడిపోయేవాళ్ళు
తిని తప్పులు తీసేవాళ్ళు
అలిగి తలనొప్పులు తెచ్చేవాళ్ళు
ఎందరో మహానుభావుల కన్నా
నయమే కదా
అనుకోని అతిథి.

- వేముల ప్రభాకర్ 9533120533