అమృత వర్షిణి

బండరాళ్లు నడుస్తున్నాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ చరాచర సృష్టిలో ఎన్నో వింతలు దాగి ఉన్నాయి. వాటిలో పరిశోధకులు నిగ్గు తేల్చి నిజం తెలుసుకున్నవి కొనే్న ఉన్నాయి. మరి కొన్నింటి వెనుక దాగిన నిజాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో బయటికి రాలేదు. ఆ వింతలకు అసలు కారణం ఏమిటో తెలియలేదు. అలాంటి వింతే అమెరికాలోని మిడిల్ కాలిఫోర్నియా సమీపంలో గల పానామింట్ పర్వత సానువులకు దగ్గరగా ఉండే డెత్‌వాలీ... మృత్యులోయలో జరుగుతోంది. మానవ మాత్రులు కానరాని ఆ ప్రాంతంలో ఉండే రాళ్లు వాటంతట అవే కదులుతుంటాయి. అలాగని అవి చిన్నాచితకా రాళ్లు కాదు. పెద్దపెద్ద బండరాళ్లు. మనిషి మామూలుగా ఎత్తలేని పరిమాణంలో ఉండే ఆ రాళ్లు ఎలా కదులుతున్నాయో పరిశోధకులకు అంతుబట్టడంలేదు. ఈ రాళ్లకు పరిశోధకులు ముద్దుగా సెయిలింగ్ స్టోన్స్, స్లైడింగ్ రాక్స్, మూవింగ్ స్టోన్స్ అని పేర్లు పెట్టుకున్నారు. ఎడారి ప్రాంతమైన ఆ చోట లెక్కకు మిక్కిలిగా రాళ్లు కనిపిస్తాయి. మనకి. ఆ రాళ్లు ఉన్న చోటు నుండి కదులుతుంటాయి. అయితే ఆ రాళ్లు ఎలా కదులుతున్నాయో, ఎవరు వాటిని కదుపుతున్నారో ఎవరికీ తెలియదు. ఎడారి ప్రాంతంలా కనిపిస్తున్నా అక్కడ ఒకప్పుడు అతిపెద్ద సరస్సు ఏదో ఉండి ఉంటుందని కొందరు పరిశోధకులు అంటున్నారు. ఆ సరస్సు వాతావరణ మార్పుల వల్ల ఎండిపోయిందని, అందులోని రాళ్లే ఇప్పుడు అక్కడ మనకి కనిపిస్తున్నాయని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. ఆ రాళ్లలో కొన్ని ఏడు వందల పౌన్ల వరకు బరువు ఉంటాయి. అయినప్పటికీ ఆ పెద్దపెద్ద రాళ్లు కూడా ముందున్న చోట ఉండకుండా స్థానచలనం పొందుతూ ఉంటాయి. అయితే ఆ రాళ్లు ఎలా కదులుతున్నదీ, ఏ వైపు కదులుతున్నదీ మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ రాళ్లు మొదట ఉన్న చోటు నుండి కదలగానే ఆ మేరంతా ఎడారి ఇసుకలో చారికలు ఏర్పడుతుంటాయి. దాని వల్ల ఆ రాళ్లు ఎక్కడి నుండి ఎక్కడికి కదిలిందీ ఇట్టే తెలిసిపోతుంటుంది. అలా రాళ్లు కదిలి వచ్చిన ప్రాంతాన్ని రేస్ ట్రాక్ ప్లే అంటున్నారు పరిశోధకులు. అయితే ఈ రాళ్లు ప్రతిరోజూ కదులుతున్నట్లు ఆధారాలు లేవు. పరిశోధకుల అంచనా ప్రకారం ఈ రాళ్లు కొన్ని మాసాలకు ఒకసారి గానీ, ఒకటి రెండేళ్లకు ఒకసారి గానీ కదులుతున్నాయి. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఒక రాయి కదలడం మొదలుపెడితే, దానికి సమాంతరంగా మరో రాయి కూడా కదులుతుంది. విచిత్రంగా ఆ రెండు రాళ్ల బరువు సమానంగా ఉండడం పరిశోధకులను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పానామింట్ ఎడారిలోని రాళ్ల కదలికలను పరిశోధకులు తొంభై ఏళ్ల క్రితమే గుర్తించారు. డెబ్భై ఏళ్ల నుండి ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఈ రాళ్ల కదలికల వెనుక రహస్యం మాత్రం పూర్తిగా వెల్లడి కాలేదు. అలాగే ఈ రాళ్ల మీద పరిశోధనలు సాగుతున్నంత కాలం ఇవి ఒక్క అంగుళం కదల్లేదు. పరిశోధకులు వెళ్లిపోయిన తర్వాత ఈ రాళ్లలో చాలా రాళ్లు ముందున్న ప్రాంతాన్ని వదిలి దూరంగా వెళ్లిపోయాయి. పరిశోధకులు ముందు మార్కింగ్ చేసుకుని వెళ్లి మళ్లీ వచ్చి చూసేసరికి ఇవి స్థానభ్రంశం చెంది ఉన్నాయి. ఈ కారణంగానే ఈ రాళ్లు కదులుతుండగా చిత్రీకరించడం వీలు కాలేదు. కదలకుండా ఉన్నప్పుడు ఫొటోలు మాత్రం తీశారు. 1955, 1972లో బాండ్ షార్ప్, డ్విట్ కేరే అనే పరిశోధకులు తొలిసారిగా ఇక్కడ పరిశోధనలు మొదలుపెట్టారు. అప్పట్లోనే ముప్పై వరకు రాతిశిలలు కదులుతున్నట్లు గుర్తించారు. వాటికి పేర్లు పెట్టి, వాటి చుట్టుకొలతలు తీసుకున్నారు. కొన్ని మాసాల తర్వాత మళ్లీ వెళ్లి చూస్తే అక్కడి ఇరవై అయిదు రాళ్లు రెండు వందల అడుగుల వరకు కదిలినట్లు గుర్తించారు. 1993లో జరిగిన పరిశోధనల్లో కరెన్ అనే రాయి అరమైలు దూరం కదిలి వెళ్లినట్లు గుర్తించారు. వర్షాకాలంలో విస్తారంగా వర్షాలు కురిసినా వేసవిలో ఎండిపోతుంది. ఆ సమయంలో రాళ్లకు, నేలకు మధ్య ఒరిపిడి తక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో గాలి వేగం ఆ రాళ్లను కదిలించగలుగుతుందని, ఆ కారణంగానే అక్కడి రాళ్లు ఉన్న చోటు నుండి మరో చోటుకు కదిలి వెళుతున్నాయని కొందరు పరిశోధకులు సిద్ధాంతీకరించారు. అలాగే మంచు, గాలి, ఇతర వాతావరణ పరిస్థితులు కూడా రాళ్ల కదలికలకు కారణమని, అది కూడా వేసవిలోనే ఇవి కదులుతాయని అంటున్నారు. ఇలా కదిలే రాళ్ల గురించి ఎన్నో పరిశోధనలు జరిగి, ఎందరో పరిశోధకులు రకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చినా కచ్చితంగా ఈ రాళ్ల కదలికకు ఇదీ కారణమని నిరూపణ అయితే కాలేదు. అందుకే ఇదొక రహస్యంగానే ఇప్పటికీ చెప్పుకుంటున్నారు.

- నీహారిక