'క్లాప్' కొట్టు గురూ!

పాత్రికేయురాలిగా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా రోజురోజుకీ చేసే చిత్రాలు.. వేసే క్యారెక్టర్ల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటోంది. అందుకే ఆమె చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాల్ని నమోదు చేసుకుంటున్నాయి. శత్రుఘ్నసిన్హా తనయగా పరిశ్రమలోకి వచ్చినా.. అటు తర్వాత ఆమె చేసే చిత్రాల ద్వారా తనకంటూ ఓ క్రేజ్‌ని సృష్టించుకుంది. కెరీర్ విషయంలో ఎప్పటికప్పుడు తీసుకునే జాగ్రత్తలే ఆమెను ఈ విధంగా తీర్చిదిద్దాయంటున్నారు బాలీవుడ్ ప్రముఖులు. తాజాగా ఈ బ్యూటీ పాత్రికేయురాలిగా దర్శనమివ్వబోతోంది. అదే ‘నూర్’ చిత్రం. ఇందులో పాకిస్థాన్ పాత్రికేయురాలైన నూర్ వృత్తిలో భాగంగా ముంబయికి చేరుకుంటుంది. అక్కడ జరిగే కథ ఇది. ఈ విషయం గురించి సోనాక్షిని కదిలిస్తే- ‘‘నూర్ ఒంటరిగా వుంటుంది. జీవితాన్ని సంతోషంగా గడపాలని అనుకున్నా, ఏదో లోటు ఆమెను నిత్యం వెంటాడుతుంటుంది. సామాజిక సమస్యలపై కథనాలు రాయాలనేది ఆమె ఆశయం. ఆ సమయంలో అనుకోకుండా జరిగిన సంఘటనతో ఆమె జీవితం వూహించని మలుపు తీసుకుంటుంది. అదేంటి? ఎందుకు అలా జరిగిందనేది ‘నూర్’ చిత్రం. ఇందులో నేను చేసిన క్యారెక్టర్ నాకు చాలా సంతృప్తినిచ్చింది’’ అంటూ ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చింది.

-సమీర్