సెంటర్ స్పెషల్

ఒక్క తూటా చాలు 28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగోత్రి కొన్ని క్షణాలు వౌనంగా ఉన్నాడు.
‘నీకెంత కావాలి?’ యుగంధర్ కళ్లల్లోకి చూస్తూ అడిగేడు.
బదులుగా నవ్వి,
‘అయిదేళ్ల క్రితం లక్ష్మీ టాకీస్ దగ్గర వ్యభిచార గృహం ఉండేది. ఆ తర్వాత దాన్ని హైటెక్ వ్యభిచారంగా మార్చావు. మొత్తం ఇరవై ఎనిమిది అమ్మాయిలు, తొమ్మిదిమంది యువకులు పని చేస్తున్నారు. వివేక్ నీ వ్యాపారానికి అడ్డు తగిలాడని అతన్ని షరీఫ్‌తో చంపించావు’ చెప్పాడు యుగంధర్.
‘నేనో కాల్ చెయ్యాలి’ అన్నాడు గంగోత్రి.
‘ఎవరికి?’
‘మా లాయర్‌తో మాట్లాడాలి. అన్యాయంగా అర్ధరాత్రి బలవంతంగా ఇంటి నుంచి తీసుకొచ్చి పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్నావు. నిన్ను అంత తేలిగ్గా వదలను’ కోపంగా అన్నాడతను.
నిదానంగా అతని ముఖంలోకి చూశాడు యుగంధర్.
‘్భపతిని ఎందుకు చంపావ్?’
తృళ్లిపడ్డాడు గంగోత్రి. అతను తేరుకోవడానికి కొంత సమయం పట్టింది.
‘మతిలేని మాటలు అవి.. భూపతి ఇప్పుడు దుబాయ్‌లో ఉన్నాడు. వారానికి ఒకటి రెండుసార్లు నాతో మాట్లాడతాడు. మీరు నా మీద అనవసరమైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో నాకు తెలియడం లేదు. నా సేవలు పొందిన పోలీసు అధికార్లు ఎందరో ఉన్నారు’ చెప్పాడు గంగోత్రి.
‘్భపతి దుబాయ్ నంచి నీతో మాట్లాడతాడనేది నీ కల్పన. ఈ అయిదు సంవత్సరాల్లో నువ్వు ఉపయోగించే ఫోన్లకి దుబాయ్ నుంచి ఒక్క కాల్ కూడా రాలేదు’
తెల్లబోయి చూశాడు గంగోత్రి.
‘నీ సమాచారం మొత్తం నా దగ్గర ఉందని నీకు తెలియదు. రెండేళ్ల క్రితం రైల్వేస్టేషన్ పక్కనున్న కాలువ వెడల్పు చేస్తున్నపుడు ఓ అస్థిపంజరం బయటపడింది. చిటికెన వేలుకి ‘బి’ అనే అక్షరంతో ఉంగరం ఉంది. మెడలోని పులిగోరు శిథిలమై దొరికింది. అయిదేళ్ల క్రితం భూపతి ముంబై రైలు ఎక్కాడని చెప్పిన మరునాడు ఎయిర్‌పోర్టు దగ్గర తిరుపతి అనే వ్యక్తిని నెంబరు లేని లారీ గుద్దేసింది. అతను మూడేళ్ల నుంచి భూపతి కారుకి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అద్భుతమైన స్కెచ్‌తో భూపతిని హతమార్చి, దానికి సాక్షి అయిన డ్రైవర్‌తో ఎప్పటికైనా ప్రమాదమని అడ్డు తొలగించుకున్నావు. ఈ నెట్‌వర్క్ నడపాలంటే నీ మాట ఎవరూ వినరని భఊపతి బతికున్నట్టు నాటకం అడుతున్నావు’
‘అంతా అబద్ధం..’ అరిచేడు గంగోత్రి.
‘్భపతి పేరు మీద నువ్వే బ్యాంక్‌లో అకౌంట్ తెరిచావు. అప్లికేషన్‌లో నీ ఫొటో అంటించింది అందుకే...’
భిగ్గరగా నవ్వేడు గంగోత్రి. ఆ నవ్వు ఇంటరాగేషన్ రూములో ప్రతిధ్వనించింది.
‘ఓ అస్థిపంజరం దొరికిందని చిక్కటి కథ అల్లేసావ్. ఎక్కడో జ్ఞానాపురంలో అయిదేళ్ల క్రితం ఓ మనిషిని చంపి పూడ్చిపెట్టడం నిజమనుకుంటే.. అది ఎవరిదో తెలుసుకోవడం, హంతకుడ్ని పట్టుకోవడం సాధ్యమా? బుర్రలేని వాడికి చెప్పినట్టు నాకు చెబుతున్నావ్’ అని, మరోసారి నవ్వేడు గంగోత్రి.
అతని వైపు నవ్వుతూ చూశాడు యుగంధర్. కొన్ని క్షణాల తర్వాత గొంతు విప్పాడు.
‘రైల్వేస్టేషన్ పక్కనున్న కాలువ వెడల్పు చేస్తున్నపుడు అస్థిపంజరం దొరికిందని అన్నాను కాని జ్ఞానాపురంలో అని చెప్పలేదు నేను. ఇప్పుడు అస్థిపంజరం దొరికిన చోటు సరిగ్గా చెప్పావ్. నీకు చాలా విషయాలు తెలియవు గంగోత్రి. ఫోరెన్సిక్ విభాగంలో స్కల్ రీ కన్‌స్ట్రక్షన్ అనే ప్రక్రియ ఉంది. ప్రొఫెసర్ పాలేకర్ అనే ఆయన ఫేషియల్ స్కల్ రీ కన్‌స్ట్రక్షన్‌లో నిష్ణాతుడు. ఒక మనిషిని చంపి పాతేశాక కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడిన పుర్రెని ఆయనకి పంపితే బతికున్నప్పటి పోలికలతో దాన్ని తయారుచేస్తాడు.’
తల తిరిగినట్టయింది గంగోత్రికి. అయిదు సంవత్సరాల క్రితం రహస్యంగా చేసిన హత్య గురించి తెలుసుకోవడం ఒక ఎత్తయితే దాన్ని సాక్ష్యాలతో నిరూపించడానికి సిద్ధపడటం మరో ఎత్తు. భూపతి ముసుగులో అంతా తనే చేస్తున్నట్టు తెలుసుకున్న యుగంధర్ వైపు చూసి జీవంలేని నవ్వొకటి నవ్వేడు.
‘నువ్వు వయసులో ఉన్నవాడివి. జీవితంలో అనుభవించాల్సింది ఎంతో ఉంది. నీకు కావాలంటే చాలామంది అందగత్తెలున్నారు నా దగ్గర. బీచ్ రోడ్డులో కనీసం ఏభై లక్షలు ఖరీదు చేసే అపార్ట్‌మెంట్ ఇస్తాను. నీకు విసుగు పుట్టేవరకూ రోజుకో అమ్మాయిని, విలువైన విదేశీ మద్యాన్ని పంపుతాను. నన్నొదిలేయ్’
‘అటు చూడు...’ చేత్తో ఇంటరాగేషన్ రూముకి ఎడమపక్క డోర్ చూపించి అన్నాడు యుగంధర్.
‘ఆ తలుపు తెరిస్తే మెట్లుంటాయి. ఆ మెట్లు దిగితే మెయిన్‌రోడ్డు వస్తుంది. సాధారణంగా దాన్ని రహస్యంగా నిందితుల్ని తరలించడానికి ఉపయోగిస్తాం. నీ ఆఫర్ అంగీకరించి ఆ మార్గం వెంట నిన్ను బయటకి పంపడం చాలా తేలిక. కాని పంపను...’
‘ఏం?’
‘చెప్పినా నీకు అర్థం కాదు. కార్గిల్ యుద్ధంలో గాయపడిన ఓ సైనికుడ్ని రక్షించడం తన బాధ్యతని, అతన్ని రక్షించి ప్రాణాలు కోల్పోయిన కెప్టెన్ విక్రమ్ బాత్రా ఏం ఆశించి ప్రాణ త్యాగం చేశాడు? కాశ్మీర్‌లో పనె్నండేళ్ల పిల్ల ఉగ్రవాదుల్ని ఎదిరించి కొందరి ప్రాణాలు కాపాడింది. దేని కోసం? తీవ్రవాదుల్ని గెలవలేనని తెలిసి చివరి వరకూ పోరాడి ప్రాణం అర్పించిన వృద్ధ హెడ్ కానిస్టేబుల్‌కి తీవ్రవాదులే సెల్యూట్ చేసింది ఎందుకోసం? ఇవన్నీ అర్థమయితే తప్ప నిన్ను వదలకపోవడానికి కారణం తెలుసుకోలేవు’
అదే సమయంలో షరీఫ్‌ని తీసుకొచ్చి ఓ కుర్చీలో కూర్చోబెట్టి వెళ్లిపోయాడు కానిస్టేబుల్ ఒకతను. షరీఫ్ తలదించుకుని కూర్చుంటే అతని వైపు నిప్పులు కక్కే కళ్లతో చూశాడు గంగోత్రి.
‘ఇక మీ ఇద్దరి చరిత్ర ముగిసినట్టే..’ చెప్పి వెనక్కి వాలేడు యుగంధర్.
‘నా మీద కేసు పెడుతున్నప్పుడు నన్ను ఆమె అంటావా? అతను అంటావా?’ నవ్వుతూ అడిగేడు గంగోత్రి.
యుగంధర్ తల పంకించి బల్లకున్న సొరుగు లాగేడు. కాగితంలో చుట్టిన బరువైన వస్తువు గంగోత్రి ముందుకి తోశాడు. అది రివాల్వర్.
‘ఆడ, మగ తేడా దానికి తెలియదు.’ చెప్పి, ఓ క్షణం తర్వాత అడిగేడు, ‘ఆ రివాల్వర్ నీదేనా? భూపతిని కాల్చింది దాంతోనే కదూ?’
గంగోత్రి రివాల్వర్ని చేతిలోకి తీసుకున్నాడు. దాని బరువుని బట్టి లోపల తూటాలు ఉన్నాయని అర్థమైంది. వెంటనే రివాల్వర్ యుగంధర్‌కి గురిపెట్టాడు.
‘ఎంతో ముందు చూపుతో భూపతిని చంపి అతని సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నా జోలికి వచ్చిన పోలీసు ఆఫీసర్ లేడు. నిన్ను బ్రతకనివ్వకూడదు. నీ జీవితంలో నువ్వు చేసిన పెద్ద పొరపాటు బుల్లెట్లతో ఉన్న రివాల్వర్ నాకివ్వడం’ అని ట్రిగ్గర్ నొక్కాడు.

(మిగతా వచ్చే వారం)

-మంజరి 9441571994