ఈ వారం స్పెషల్

అరుదైన బహుమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత నౌకాదళంలో శౌర్య పరాక్రమాలతో సేవలందించిన నౌకాదళ కేంద్రాలకు అత్యంత ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ కలర్స్‌ను బహుకరిస్తుంటారు. భారత రాష్టప్రతి ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. ప్రెసిడెంట్స్ కలర్స్ తూర్పు నౌకాదళ చరిత్రలో ఇప్పటి వరకూ ఒక్కసారే దక్కింది. ఈ కలర్స్ ప్రెజెంటేషన్‌ని 1924లో ఇంగ్లాండ్ కింగ్ జార్జ్-5 రాయల్ నేవీలో ప్రవేశపెట్టారు. 1935 డిసెంబర్ తొమ్మిదో తేదీన రాయల్ ఇండియన్ నేవీ దీన్ని అనుసరించింది. స్వాతంత్య్రానంతరం త్రివిధ దళాల్లో అత్యంత సాహసోపేత యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించిన పశ్చిమ నౌకాదళానికి 1951 మే 27న అప్పటి రాష్టప్రతి బాబూ రాజేంద్రప్రసాద్ ప్రెసిడెంట్ కలర్స్ ముంబైలో ప్రదానం చేశారు. వీనుల విందుగా వినిపిస్తున్న నేవీ బ్యాండ్ ఒకపక్క.. ధవళ వర్ణ దుస్తులతో మెరిసిపోతున్న సైనికులు మరోపక్క, త్రివిధ దళాధిపతి హోదాలో రాష్టప్రతి హుందాగా కమాండ్ సైనికులకు త్రివర్ణ పతాకంతోపాటు, భారతీయ నేవీ పతాకం కలిపి ఉన్న ఒక తెల్లటి జెండాను సైనికులకు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా జరిగే పరేడ్ ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఉంటుంది. 1987 మార్చి 25న అప్పటి రాష్టప్రతి జ్ఞానీ జైల్ సింగ్ విశాఖలో తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో కలర్స్ ప్రెజెంట్ చేశారు. అలాగే 2006 ఫిబ్రవరి 13న అప్పటి రాష్టప్రతి అబ్దుల్ కలాం ఈస్ట్రన్ ఫ్లీట్‌కు కలర్స్ ప్రదానం చేశారు. తూర్పు నౌకాదళ చరిత్రలో ఇవి మరపురాని ఘట్టాలుగా నిలిచిపోయాయ..