అమృత వర్షిణి

శిరస్సు మీద తురాయి! సరస్సుపై నివాసమోయి!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిరస్సు మీద తురాయిలాంటి జుత్తుతో ఠీవిగా కోడిపుంజు మాదిరిగా కనిపించే ‘గ్రేట్ క్రెస్టెడ్ గ్రెబి’ అనే ఒక రకమైన ఈ నీటిబాతు 19వ శతాబ్దంలో దాదాపు అంతరించిపోయే దశకు చేరుకుంది. నెత్తిమీద ఉండే ఆ తురాయే అప్పట్లో దానికి ఎంతో ఆకర్షణ. తర్వాత క్రమంలో వన్యప్రాణి సంరక్షణ అధికారుల చర్యల కారణంగా ఈ పక్షుల సంఖ్య అధికంగా వృద్ధి చెంది, ప్రస్తుతం బ్రిటన్‌లోని ఈస్ట్ ఆంగ్లీయ ప్రాంతంలో ఎన్నో సరస్సులు తదితర నీటి వనరుల్లో ఆవాసం ఏర్పరుచుకున్నాయి.
ఈ నీటి బాతుల ప్రత్యేకత ఏమిటంటే, నీటి కొలనుల్లో అడుగున ఉండే చేపలను ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా నోటికి చిక్కించుకుని, ఆరగించడం. ఒక్కోసారి అవి మింగలేనంత పెద్ద పెద్ద చేపలను కూడా కరిచిపట్టుకుని నీటిపైకి వస్తుంటాయి. మరో విశేషం ఏమిటంటే, ఈ పక్షుల కాళ్ళు శరీరానికి బాగా వెనుకగా ఉండి, అవి నడుస్తుంటే, చూడ్డానికి అందవికారంగా కనిపిస్తుంటుంది. అందువల్లనే, అవి సాధారణంగా నీటి ఒడ్డునే లేదా నీటిమధ్యలో ఉండే చిన్న చిన్న దీవుల మీదనే గుడ్లు పెట్టి, పొదుగుతుంటాయి. ప్రతిసారి రెండేసి గుడ్లు చొప్పున పెడుతుంటాయి. వీటి పిల్లల జల విహారం చూడముచ్చటగా ఉంటుంది. పెద్ద పక్షులు ఆహారం కోసం నీటి లోపలకి డైవ్ చేసినప్పుడు ఈ పిల్లకాయలు నీటిమీద తేలియాడుతూ పెద్ద పక్షులు ఆహారంతో బయటకురాగానే మళ్ళీ వాటి వీపుల మీదకు చేరిపోయి, అవి అందించే ఆహారాన్ని ఆరగిస్తుంటాయి. ఇదంతా ఒక విన్యాసంలా సాగిపోతుంటుంది. చేపలే కాకుండా కప్పలు, పీతలు, రొయ్యలు, చిన్న చిన్న పురుగులు కూడా వీటికి పంచభక్ష్యాలే. ఈ పక్షుల జంటలు చేసే విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టు కుంటాయ.

- జి.కె.