AADIVAVRAM - Others

ప్రాణమిస్తా ( సిసింద్రీ కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాచారం అడవి -పచ్చని చెట్లతో.. పక్షుల కిలకిలారావాలతో.. జంతువుల ఆటపాటల్తో.. సెలయేళ్ల గలగలలతో.. రమణీయంగా ఉంది. జంతువులన్నీ కలసికట్టుగా ఉంటూ జీవనం సాగిస్తూన్నాయి. అనుకోకుండా ఆ దట్టమైన అడవిలోకి సింహం ప్రవేశించింది.
వస్తూ వస్తూనే ఆకలితో ఉండటంవల్ల ఒక జింకపై దాడి చేసి దాన్ని చంపి భుజించింది. దీంతో జంతువులన్నీ భయపడి గజగజ వణికిపోయాయి. ‘ఓ జంతువులారా! మీరు రోజుకొక్కరు చొప్పున నాకు ఆహారంగా వచ్చి ఆకలి తీర్చారే సరే.. లేదంటే ఒక్క రోజులోనే మీ జాతినంతా చంపేస్తాను’ అంటూ సింహం అక్కడి కొండ మీదికి చేరింది.
జంతువులన్నీ సమావేశమయ్యాయి దుఃఖిస్తూ. ‘ఈ సింహం ధాటికి మనమందరం ఆహారం కావల్సిందేనా? మనల్ని కాపాడేవారే లేరా’ అంటూ విలపించసాగాయి. అంతలో ఓ వృద్ధ జింక ‘రేపు సింహానికి ఆహారంగా ఎవరు వెళతారు’ అని అన్నది. ‘నేను వెళతాను. నేను వెళతాను’ అంటూ జంతువులు ముక్తకంఠంతో అరవసాగాయి.
వృద్ధ జింక ఆశ్చర్యపోయింది. ప్రాణం కాపాడుకోవాలనుకుంటారు ఎవరైనా. కానీ వీరంతా ‘ప్రాణమిస్తా’ నంటూ అనడం ఆశ్చర్యం వేసి, జంతువుల ఐక్యతకు అబ్బురపడింది. ‘మనకు ఇటువంటి చిక్కు సమస్య ఎప్పుడూ రాలేదు. అందువల్ల ‘నేనే సింహానికి ఆహారమవుతా’ అన్నది వృద్ధ జింక. అంతా తమ నివాసాలకు వెళ్లాయి.
ఉదయం జంతువులన్నీ వృద్ధ జింక దగ్గరకు చేరాయి. అన్ని జంతువులూ అడవి దాటి వెళ్లి సాయంత్రం రమ్మంది వృద్ధ జింక. అంతా దుఃఖిస్తూ వెళ్లారు. రాత్రి కడుపు నిండా తిన్న సింహం నెమ్మదిగా లేచింది. సమయం మించుతోంది. ‘నాకు ఆకలవుతోంది. నా ఆహారం ఏదీ? అన్ని జంతువులనూ మట్టుపెడతా. మాట తప్పారు’ అంటూ సింహం ఆవేశంగా అడవంతా పరుగెత్తింది. ఒక్క జంతువూ కనిపించలేదు. పెద్ద కొండ ఎక్కింది. ఎవ్వరూ కనిపించలేదు.
దూరంగా ఒక జింక పడుకుని ఉండటం సింహానికి కన్పించింది. కొండపై నుంచి వేగంగా పరుగెత్తి జింకపైకి దూకింది. జింక ఒక్కసారిగా పక్కకు జరిగింది. సింహం తల బండరాయికి వేగంగా తగిలి తల బద్దలై చనిపోయింది. సాయంత్రం జంతువులన్నీ దుఃఖిస్తూ వచ్చి పడి ఉన్న సింహాన్ని, వృద్ధ జింకను చూసి ఆనందించాయి.

-ఉండ్రాల రాజేశం