ఓ చిన్నమాట!

వాట్సప్ గ్రూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాట్సప్‌లు వచ్చిన తరువాత చాలా సౌకర్యాలు పెరిగాయి. మాట్లాడుకోవచ్చు. అదే విధంగా చూస్తూ మాట్లాడుకోవచ్చు. వీడియోలు పంపుకోవచ్చు. ఫొటోలు సరేసరి! అలా త్వగరా ప్రపంచవ్యాప్తంగా స్నేహితులతో, పిల్లలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవచ్చు. బ్రాడ్‌కాస్ట్ లిస్ట్‌లో ఒకే ఒక్కసారి బటన్ నొక్కి వందల మందికి సమాచారాన్ని పంపించుకునేందుకు వీలవుతుంది. ఒక్కొక్కరికి కాకుండా ఒకేసారి అందరికీ ఫొటోలు, వీడియోలు పంపే అవకాశం ఏర్పడుతుంది.
అదే విధంగా మన స్టాటస్‌ను రోజూ మార్చుకునే అవకాశం కూడా లభించింది. మనం రాసిన ఆర్టికల్స్‌ని కానీ, బొమ్మలను కానీ, ఫొటోలను కానీ ఈ స్టాటస్‌లో పెట్టవచ్చు. మన కాంటాక్ట్ లిస్ట్‌లో వున్న వాళ్లు వాటిని చూసే అవకాశం ఏర్పడుతుంది. మనం వాళ్లకి ప్రత్యేకంగా పంపించకుండానే వాళ్లు చూసే అవకాశం ఈ స్టాటస్ వల్ల లభిస్తుంది. ఇట్లా ఎన్నో సౌకర్యాలు. అదే విధంగా మరెన్నో అసౌకర్యాలు. రోజూ లెక్కలేనన్ని గుడ్‌మార్నింగ్ ఫొటోలు, వీడియోలు ఇట్లా ఎన్నో వచ్చి మనలని ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
వాట్సప్‌ల ద్వారా గ్రూపులను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కవులందరూ కవుల గ్రూపు అని, స్నేహితులందరు స్నేహితుల గ్రూపు అని, వూరుని వదిలి వెళ్లిన వాళ్లు ‘వూరు యాదిలో’ అని, ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల గ్రూపు అని ఇట్లా ఎన్నో గ్రూపులు. ఈ గ్రూపుల వల్ల కొంత సమాచారం లభిస్తుంది. అయితే గ్రూపుల్లో వ్యక్తిగత సంభాషణలు ఉండకూడదు. కానీ కొంతమంది వ్యక్తిగత సంభాషణలు చేస్తూ చీకాకు కలిగిస్తుంటారు. గ్రూపు ఏ లక్ష్యంతో ఏర్పడిందో ఆ లక్ష్యానికి సంబంధించిన అంశాలు కాకుండా ఇతర అంశాలు గ్రూపుల్లో చర్చించి మిగతా సభ్యులకి అసౌకర్యం కలిగిస్తూ ఉంటారు.
ఈ మధ్య ఓ కవి మిత్రుడు ఓ కవుల గ్రూప్‌ని ఏర్పాటు చేశాడు. ఆయన దగ్గర ఓ ఐదు వందల మంది కవుల చిరునామాలు, టెలిఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఆ టెలిఫోన్ నెంబర్ల ఆధారంగా గ్రూపుని ఏర్పాటు చేశాడు. అతడు సీనియర్ కవి మిత్రుడు. కొత్తగా స్మార్ట్ఫోన్ కొన్నాడు. వాట్సప్‌లో ఉండే సౌకర్యం అతనికి బాగా నచ్చింది. అందుకని కవులు తమ కవిత్వాన్ని ఇతర మిత్రులకి అందే విధంగా, కవిత్వం మీద మంచి చర్చ జరగాలన్న ఉద్దేశంతో గ్రూపుని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి గ్రూపుని వేదికగా ఏర్పాటు చేశాడు.
చాలామంది మిత్రుల మాదిరిగానే అతను గ్రూపులో చేర్చిన కవుల దగ్గర నుంచి అనుమతిని తీసుకొని గ్రూపులో చేర్చలేదు. కొంత స్వేచ్ఛ తీసుకొని అందరినీ చేర్చాడు. ఎవరో ఒకరిద్దరు మిత్రులు తప్ప ఎవరూ పూర్వానుమతి తీసుకొని గ్రూపుల్లో చేర్చడం లేదు.
కవులు కవిత్వం పోస్ట్ చేయటం మొదలుపెట్టారు. కవిత్వం మీద చర్చ కూడా మొదలైంది. ఎంతో మంది కవుల ఫోన్ నెంబర్లు చాలామందికి లభించాయి. వ్యక్తిగతంగా వాళ్లు సంభాషించుకోవడానికి అవకాశం చిక్కింది.
అయితే ఓ ఇద్దరు ముగ్గురు కవులు అతిగా స్పందించారు. ‘మా అనుమతి తీసుకోకుండా మమ్మల్ని గ్రూపులో ఎలా చేరుస్తారు?’ అని ప్రశ్నించాడు. అక్కడితో వూరుకోలేదు. ‘మీకు ఈ మాత్రం సంస్కారం కూడా లేదా?’ అని కూడా అన్నారు.
మా సీనియర్ కవి మిత్రుడు బాగా బాధ పడిపోయి అతను తనే సృష్టించిన గ్రూపు నుంచి నిష్క్రమించి అందరికీ వ్యక్తిగతంగా సంజాయిషీ ఇచ్చుకున్నాడు.
అతను ఓ సదుద్దేశంతో గ్రూపుని ఏర్పాటు చేశాడు. పూర్వానుమతి తీసుకోలేదు. నిజమే! అదేమీ ఘోరమైన తప్పిదం కాదు. గ్రూపు నుంచి నిష్క్రమించే అవకాశం అందరికీ ఉంది. ఆ కవి మిత్రుడ్ని గాయపరచకుండా ఆ గ్రూపు నుంచి నిష్క్రమించవచ్చు. కవి మిత్రునికి ప్రజాస్వామ్య సంస్కారం లేదని నిందించిన కవి మిత్రుల సంస్కారం ఏ పాటిది..?
రోజూ చాలామంది చాలా మందిని గ్రూపుల్లో చేరుస్తూ ఉంటారు. ఇష్టం లేనప్పుడు వాటి నుంచి చాలామంది నిష్క్రమిస్తూనే ఉంటారు. అంతే కానీ ఆ గ్రూపు పరిపాలకుడిని గాయపరచరు.
గాయపడకుండా నిష్క్రమించడం ప్రజాస్వామ్య పద్ధతి.
చివరికి గ్రూపు అంతరించింది.

- జింబో 94404 83001