సబ్ ఫీచర్

ఆదుర్దాతో అవస్థలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతరులకు చెప్పడం తేలికే కానీ, ఆదుర్దా పడకుండా ప్రస్తుత రోజుల్లో హాయిగా గడపడం ఒక సవాలే. నేటి ఆధునిక జీవనం సమస్యల మయం అవుతోంది. పాత సమస్యను పరిష్కరించుకునే లోగా ఏదో ఒక కొత్త సమస్య చుట్టుముడుతుంది. సమస్య వచ్చిందంటే మొదట అది తెచ్చేది ఆదుర్దానే. పిల్లల దగ్గర్నించి పెద్దవాళ్ళదాకా, అమాయకుల దగ్గర్నుంచి మేధావుల దాకా అందరూ ఏదో ఒక విషయంలో ఆదుర్దా పడకుండా ఉండలేక పోతున్నారు. ఎందుకంటే ఏ సమస్య ఎటువైపునుండి వస్తుందో ఊహించలేక పోవడం, ఒకవేళ ఊహించినా నింపాదిగా పరిష్కరించుకునే పరిస్థితులైతే ఉండటం లేదు.
ఆదుర్దా పడే సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేసరికి ఒక్కొక్కరి స్పందన ఒక్కోలా ఉంటుంది. తమకు నచ్చిన ఆలోచన ఏదైనా దానినే తుది నిర్ణయంగా వెంటనే అమలుచేసేవారు ఒక రకం. అలాకాక ఒకటికన్నా ఎక్కువ పద్ధతుల్లో సమస్యను విశే్లషించుకుని, అందుకు ఎక్కువ సమయం తీసుకుని ఒక పద్ధతిలో అమలుచేసేవారు మరో రకం.
ఈ రెండు రకాలకన్నా భిన్నమైన మనస్తత్వం కలవారూ ఉన్నారు. వీరి మనసుకు పరిష్కార మార్గాలు అనేకం కనిపిస్తాయి. కానీ, ఏ నిర్ణయం వెంటనే తీసుకోలేరు. తమకు ఎదురైన సమస్య గురించి వంద కోణాలలో విశే్లషించి మరీ చెప్పగలుగుతారు. అయితే, ఏదో ఒక నిర్ణయం తీసుకుని అమలు చేయమంటే వెనకడుగు వేస్తారు.
చాలామందికి తమ సందేహాలను వదిలించుకునేందుకు, తుది నిర్ణయానికి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. తమ నిర్ణయం ఎటువంటి ఉపద్రవాన్ని తెచ్చిపెట్టకూడదని, ఒక పరిష్కారం మరో సమస్యను తెచ్చిపెట్టకూడదని ఆదుర్దా చెందుతూ కొంతమంది కాలయాపన చేస్తుంటారు. ఇంకొందరైతే ఆదుర్దాలో ఒత్తిడికి లోనవుతూ పొరపాట్లు చేస్తుంటారు.
ఆదుర్దాను పూర్తిగా వదిలించుకునేందుకు ఏదో ఒక పరిష్కార మార్గాన్ని సకాలంలో ఎన్నుకోవాలి. సంశయాత్మక మనస్తత్వానికి కారణాలు అనేకం. అందులో ఒకటి- అవసరాన్ని మించి ఆలోచించటం, రెండోది- సమస్యను చూడకూడని కోణంలో చూడటం, అనవసరంగా భయపడటం, తమ నిర్ణయాల్ని ఇతరులు తప్పుపడతారని ఆందోళన చెందడం. తమ నిర్ణయాలకు కట్టుబడి వుండరని బలహీన మనస్తత్వం వల్లనే ఇబ్బంది వస్తుంది. ‘ఈ నిర్ణయం నాది.. దీని ఫలితం కూడా నేనే భరిస్తాను..’ అని దృఢంగా అనుకోగలిగితే మనసులోని సంశయాలన్నీ తొలగిపోయి ఆదుర్దా తగ్గిపోతుంది.
మనసులో ఏవేవో అనుకోవటం కన్నా వాటన్నింటినీ కాగితం మీద వివరంగా రాసుకోవటం మంచిది. బంధుమిత్రులు ఏమనుకుంటారోనన్న భావన కలిగితే దానిని వివరంగా కాగితంపై ఎక్కించండి. సన్నిహితులు, ఆత్మీయులకు తమ నిర్ణయంతో కలిగే లాభనష్టాలు ఎటువంటివనేవి కూడా ఆలోచించండి. ఒక నిర్ణయానికి కట్టుబడి, దాన్ని అమలు చేయాలనుకున్నపుడు వ్యక్తిగతంగా కలిగే నష్టాల గురించి కూడా ఆలోచించాలి. ఇలాంటివన్నీ కాగితంపై రాసుకుని తీరిగ్గా చదివితే, సమస్య ఏమిటన్నది క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఆదుర్దాను వీడి సరైన నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతుంది. భయం వల్ల, ఆత్మవిశ్వాసం లోపించటం వల్లనే ఆదుర్దా పడుతున్నామని అవగతమవుతుంది. దాదాపు 90 శాతం మంది తమ నిర్ణయాలను వాయిదా వేసేది ఆదుర్దా వల్లనే. మనసులోని భావాలను ఎవరికివారు హేతుబద్ధంగా విశే్లషించుకుంటే- ఆదుర్దాకు తెరపడినట్లేనని గ్రహించాలి.

-హిమజ