అంతర్జాతీయం

ఆఫ్గాన్‌లో భారత దౌత్యకార్యాలయంపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్:ఆఫ్గానిస్తాన్‌లోని భారత దౌత్య కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. అయితే సకాలంలో భద్రతాదళాలు స్పందించి ఎదురుదాడి చేయడంతో పెను ప్రమాదం తప్పింది. జలాలాబాద్‌లోని భారత దౌత్య కార్యాలయంవద్దకు వస్తూనే కాల్పులు జరిపి బాంబులు విసిరిన ఉగ్రవాదులు లోపలికి జొరబడేందుకు తెగబడ్డారు. అయితే ఐటిబిపి, ఆఫ్గాన్ దళాలు ఉగ్రవాదులపై కాల్పులు జరిపి ఎదురుదాడి చేశారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల దాడిలో పదిమందికి గాయాలయ్యాయి. దౌత్యకార్యాలయంలో సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.