ఆంధ్రప్రదేశ్‌

అగ్రిగోల్డ్ నిందితులకు 14 రోజుల రిమాండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: వివిధ స్కీమ్‌ల కింద వేలాది కోట్ల డిపాజిట్లు వసూలు చేసి ఖాతాదారులను వంచించిన కేసులో అగ్రిగోల్డ్ చైర్మన్ ఎ.వి.రామారావు, ఎం.డి. ఎ.వి.ఎస్.నారాయణరావులకు 14 రోజుల పాటు రిమాండు విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.గురువారం వారిని అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు శుక్రవారం ఏలూరులోని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. కోర్టు రిమాండు ఉత్తర్వులతో జిల్లా జైలుకు తరలించారు.జైలుకు తరలించే ముందు వారికి ఏలూరు ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేశారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు అగ్రిగోల్డ్ బాధితులు పెద్దసంఖ్యలో రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ వెంకటరామారావును బాధితులు అడ్డుకున్నారు.తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. బాధితులందరికీ న్యాయం చేస్తామని చైర్మన్‌ హామి ఇచ్చారు.