రాష్ట్రీయం

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, డిసెంబర్ 31: అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను వేలం ద్వారా విక్రయించేందుకు హైకోర్టు అనుమతించింది. గురువారం ఈ కేసుపై జరిగిన విచారణ సందర్భంగా త్రిసభ్య కమిటీ తరఫున హాజరైన న్యాయవాది రవి ప్రసాద్ కోర్టుకు నివేదిక అందించారు.త్రిసభ్య కమిటీ ఈ-వేలం నిర్వహించేందుకు గాను మూడు సంస్థలను ఖరారు చేసిందని తెలిపారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసేల్, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసనం అగ్రిగోల్డ్ సంస్థ మోసాలపై దాఖలైన కేసును విచారణకు చేపట్టింది. ఈ సందర్భంగా త్రిసభ్య కమిటీ తరఫు న్యాయవాది ఇచ్చిన వివరణతో ధర్మాసనం ఆస్తుల వేలం నిర్వహణకు ముందుకెళ్లాలని అనుమతించింది. మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ సహా మూడు కంపెనీలను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఆరు ఆస్తులకు గాను ఒక్కో కంపెనీ రెండేసి ఆస్తులను ఈ-వేలం నిర్వహణ చేపడతాయని వివరించారు. వేలం నిర్వహణ మూడు వారాల్లో ప్రారంభిస్తామని కోర్టుకు న్యాయవాది వివరించారు. అగ్రిగోల్డ్ కేసులో విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని, చార్జిషీట్ ఇంతవరకు ఎందుకు వేయలేదని ధర్మాసనం ఎపి ప్రభుత్వం తరఫు న్యాయవాది ఎం.కృష్ణప్రకాశ్‌ను ప్రశ్నించింది. ఇందుకు ఆయన ధర్మాసనానికి వివరణ ఇస్తూ ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాల్సిన అవసరం లేదని, విచారణ అధికారి ఫోరెన్సిక్ నిపుణుల నుంచి నివేదిక రాగానే సమగ్ర చార్జిషీట్‌ను దాఖలు చేస్తారని కోర్టుకు నివేదించారు. అనంతరం ఈ కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.