బిజినెస్
పెట్టుబడిదారుల సొమ్ము చెల్లించని సహారా క్రెడిట్ సొసైటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 25 December 2015
వివరణ కోరిన వ్యవసాయ శాఖ
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: పెట్టుబడిదారులకు డబ్బులు చెల్లించలేదని వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని సహారా గ్రూపునకు చెందిన సహకార పరపతి సంఘానికి కేంద్ర వ్యవసాయ శాఖ ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలకు ఆ సంఘం ఇప్పటి వరకూ ఎటువంటి వివరణ ఇవ్వలేదు. మొత్తం 12 కేసులకు సంబంధించి సహారా సహకార పరపతి సంఘం నుంచి వివరణ కోరామని, దీనిపై ఇప్పటివరకూ ఆ సంఘం ఎటువంటి సమాధానం ఇవ్వలేదని వ్యవసాయ శాఖ సీనియర్ అధికారి ఒకరు పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. గతంలోని సహారా పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టిన సొమ్మును కొత్త సహకార పరపతి సంఘ పథకాల్లోకి బదిలీ చేసుకోవాల్సిందిగా ఖాతాదారులను బలవంతపెడుతున్నట్లు సహారా ఏజెంట్లపై ఫిర్యాదులు వచ్చాయని మరో సీనియర్ అధికారి తెలిపారు.