రాష్ట్రీయం

నిర్మాణాలకు ఇకపై ఇంధన సంరక్షణ కోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 26:రాష్ట్రంలో కొత్త భవనాల నిర్మాణాలకు ఇంధన సంరక్షణ బిల్డింగ్ కోడ్‌ను అమలు చేయాలని చట్టబద్ధం చేసినట్లు ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి గ్రీన్ బిల్డింగ్ మార్గదర్శకాలను రాష్ట్రప్రభుత్వం గతంలోనే జారీ చేసిందన్నారు. దీనివల్ల జపాన్, బ్రిటన్ తదితర దేశాలు అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం వహించేందుకు ఆసక్తిని వ్యక్తపరిచాయన్నారు. ఇంధన సంరక్షణ బిల్డింగ్ కోడ్‌ను అమలు చేసేందుకు విధి విధానాలను ఖరారు చేసే విషయమై జనవరిలో విజయవాడలో సదస్సును నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇన్ బిల్డింగ్స్ అంతర్జాతీయ సదస్సు ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సును యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంధన సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. యుఎన్‌టిపి సీనియర్ సలహాదారు మాన్యుల్ సోరియనో మాట్లాడుతూ ఇంధన సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన ఇంధన సంరక్షణ సంఘం చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో మీడియా చేసిన కృషి అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసస్ ఎండి సౌరబ్ కుమర్, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఎండి డాక్టర్ అజయ్ మాథూర్, కార్యదర్శి సంజయ్ సేథీ, రాష్ట్ర ఇంధన సంరక్షణ సంఘం సిఇవో చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు.