రెండో సినిమాకు రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని మూడోతరం వారసుడు అక్కినేని అఖిల్ హీరోగా పరిచయవౌతూ రూపొందిన అఖిల్ చిత్రం బాక్సాఫీసువద్ద బోల్తాపడడంతో తన రెండో చిత్రంపై ఎక్కువ దృష్టి సారించారు. ఇప్పటికే పలు కథలు వింటున్న అఖిల్ తన రెంతో సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టాడు. ఇటీవలే అఖిల్ సినిమాకు దర్శకుడు ఓకే అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున హీరోగా ‘ఊపిరి’ చిత్రాన్ని రూపొందిస్తున్న వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఇటీవలే నాగార్జున వంశీతో చర్చలు జరిపినట్టు తెలిసింది. మరోవైపు‘ఊపిరి’ సినిమా బాగా రావడంతో నాగార్జున నమ్మకం ఇంకా రెట్టింపయ్యిందని అంటున్నారు. వంశీ పైడిపల్లి గతంలో చేసిన సినిమాలతో టెక్నికల్ దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అఖిల్ రెండో సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.