జాతీయ వార్తలు

అఖిలేష్‌పై మాయావతి విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పాటైన కూటమి విఫలం కావటంతో ఎస్పీ, బీఎస్పీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎన్నికల తరువాత కూటమిని రద్దు చేస్తున్నట్లు ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించిన నేపథ్యంలో ఈ విభేదాలు మరింత ముదిరాయి. కాగా మాయావతి పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మరోసారి అఖిలేష్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి తాను అఖిలేష్‌తో ఫోన్‌లో మాట్లాడాలని ప్రయత్నించానని, అందుకు ఆయన స్పందించలేదని అన్నారు. ఎస్పీ నాయకులు, కార్యకర్తలు తనను విమర్శించినా కనీసం అఖిలేష్ యాదవ్ స్పందించలేదని ఆరోపించారు. అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రతి కార్యక్రమాన్ని దళితులకు వ్యతిరేకంగా తీసుకున్నారని అన్నారు. అందుకే వారు ఆ పార్టీని ఓడించారని అన్నారు. అఖిలేష్ ముస్లింలకు సీట్లు ఇవ్వొద్దన్నా తాను ఇచ్చానని అన్నారు.