అక్షర

గతాన్ని తవ్వి తీసిన చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత ఆర్థిక వ్యవస్థ (1858-1914)
రచన: ఇర్ఫాన్ హబీబ్
అనువాదం: ఎం.బి.సూర్య
వెల: రూ.100
ప్రచురణ: ప్రజాశక్తి
బుక్‌హౌస్

--

చరిత్ర రచనలో శాస్ర్తియ పద్ధతులకు పెద్దపీట వేసి, ఎలాంటి మతతత్వ, దురహంకార వ్యాఖ్యానాలకు చోటులేకుండా నిష్పాక్షికంగా భారతదేశ చరిత్రను, భారతదేశ ప్రజాచరిత్రను అందించడానికి చేపట్టిన బృహత్కార్యంలో భాగంగా వెలువడిన పుస్తకం ఇది. క్రీస్తుపూర్వం 200 నుంచి భారతదేశపు ప్రాచీన గతాన్ని ప్రణాళికాబద్ధంగా రికార్డు చేయడానికి అలీగఢ్ యూనివర్సిటీ హిస్టారియన్స్ సొసైటీ సంకల్పించి.. భారత ప్రజాచరిత్ర పేరిట పుస్తకాలు అందిస్తోంది. ఆ సిరీస్‌లో 28వ పుస్తకం ఇది. భారత తొలి స్వాతంత్య్ర పోరాటం 1857లో జరిగింది. అప్పటినుంచి మొదటి ప్రపంచ యుద్ధకాలం వరకూ.. భారతదేశంలో జరిగిన ఆర్థిక పరిణామక్రమాలను చాలా సరళమైన భాషలో, గణాంకాలతో వివరించిన పుస్తకం ఇది. భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన ఆధిపత్యం ఉత్కృష్ట స్థాయిలో సాగిన ఈ సంధికాలంలో.. భారత గ్రామీణ వ్యవస్థ, రైతాంగ పరిస్థితి ఎలా వుండేది? వ్యవసాయం తీరు, రైతాంగ రుణభారం ఎలా వుండేది? పారిశ్రామిక ఉత్పత్తులు ఎలా వుండేవి? భారతీయుల ఆర్థిక జీవనంపై రైల్వేలు చూపించిన ప్రభావం ఎలా వుంది? ఇలాంటి అనేక వాస్తవ వివరాలు ఈ పుస్తకం నుంచి తెలుసుకోవచ్చు.
నాటి భారతదేశంలో వడ్డీ వ్యాపారం ఎలా వుండేది, వడ్డీ రేట్లు ఎలా వుండేవి, నాడు ఎలాంటి పరిశ్రమలు ఏర్పడ్డాయి, వాటిలో యాజమాన్య హక్కులు ఎవరికి వుండేవి, పనిచేసే కార్మికుల స్థితిగతులు ఎలా వుండేవి లాంటి వివరాలనూ తెలుసుకోవచ్చు. ఈ పుస్తకం చదివిన తర్వాత.. ఈ సిరీస్‌లో ఇంతకుముందు వచ్చిన పుస్తకాలను, తర్వాత వచ్చిన, రాబోయే పుస్తకాలను కూడా చదవాలని అనిపించడం చాలా సహజం.

- వాసిరెడ్డి