అక్షర

తొలి తెలుగు దళిత నవల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హేలావతి (నవల)
-తల్లాప్రగడ
సూర్యనారాయణరావు,
వెల: రు.35/-
ప్రతులకు- విశాలాంధ్ర బుక్‌హౌస్ అన్ని శాఖలు.
---

‘‘ఈయది నేను వ్రాయదలంచిన హిందూ దేశ కథాముక్తావళిలోని మూడవ కథ. నిమ్నజాతుల వారిని మనము దరిజేరకుండ కొట్టుదుమేని వారు మనల విడిచి యన్యమతములనాశించి హిందూ సంఘ వృక్షమును క్షీణింపజేయుదురు. మన హిందూజాతిని సంరక్షించుకొనవలెననిన, నిమ్న జాతుల నెట్టులయిననుద్ధరింపవలయు’’అని 1913లో ఈ నవల ఎందుకు రాస్తున్నానో తెలిపారు. ఈయన బ్రాహ్మణుడు. తొలి అస్పృశ్యతా నిరసన కావ్యం రాసిన మంగిపూడి వేంకటశర్మ, తొలి అస్పృశ్య నిరసన నవల రాసిన కాటూరి వెంకటేశ్వరరావు, తొలి వర్ణ నిరసన గేయం రాసిన గురజాడ..... ఇలా ఎందరో బ్రాహ్మణులే అంటరానితనాన్ని దుమ్మెత్తిపోశారు. ఆ తర్వాతివారు దీనిని అందుకోకపోవడంవల్లనే ఉద్యమాలు వచ్చాయి. ఈ హేలావతి నవలను పునర్ముద్రించి, సాహిత్యానికి కొత్త చేర్పును కలిగించిన ‘విశాలాంధ్ర’వారిని తప్పక అభినందించాలి. దీనికి సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత ఆచార్య రాచపాళెం రాసిన ముందుమాట అక్షర సత్యం. హిందూ దళితుడైన వీరబలుని కూతురు హేలావతి. తన కులం పేరుతో అనుభవిస్తున్న అవమానాలను కష్టాలను చూసింది. అందుకని దళితుడ్ని పెళ్ళిచేసుకోకూడదని నిశ్చయించుకొంది. వీరబలుని మతం మారితేనే పెళ్ళిచేస్తానని అంటారు. హేలావతికి సమ్మతించదు. వీరబలునికి పెద్ద పదవి వచ్చినప్పుడు మంత్రి కుమారుడ్ని పెళ్ళిచేసుకుంటుంది. హైందవ ప్రాబల్యం తగ్గడానికి అంటరానితనమే కారణమని అంబేద్కరులూ, కమ్యూనిస్టులూ, మార్క్సిస్టులూ పుట్టకముందే చాటిచెప్పిన నవల ఇది. ధర తక్కువే కాబట్టి కొని చదవాలి.

-ద్వా.నా.శాస్ర్తీ